రియల్ మి ఎక్స్2 ప్రో ధర రూ.29,999

Realme

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్స్ తయారీ కంపెనీ రియల్‌మి ఎక్స్2 ప్రో మార్కెట్లోకి వచ్చింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 ప్లస్ చిప్ అమర్చిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ 8జిబి/ 128 జిబి ధర రూ.29,999గా నిర్ణయించింది. 12జిబి/ 256జిబి వేరియంట్ ధర రూ.33,99గా కంపెనీ నిర్ణయింది. వీటిలో 64 – మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాను అమర్చింది. 4000 ఎంఎహెచ్ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుందని వివరించింది. ఈ రెండు – వేరియంట్లు నవంబర్ 26 నుంచి రిటైల్ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ వెల్లడించింది.

Realme X2 Pro

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రియల్ మి ఎక్స్2 ప్రో ధర రూ.29,999 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.