మార్కెట్లోకి సరికొత్త రియల్‌మి ఎక్స్2

న్యూఢిల్లీ: రియల్‌మీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌మీ ఎక్స్2’ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జి గేమింగ్ ప్రాసెసర్, 64ఎంపి క్వాడ్ కెమెరా, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ కోసం ఈ ప్రాసెసర్‌ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకతలతో వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోను. రెండు వేరియంట్లలో రియల్‌మీ ఎక్స్2 (4జిబి + 64జిబి) ధర రూ.16,999 కాగా, రియల్‌మీ ఎక్స్2 […] The post మార్కెట్లోకి సరికొత్త రియల్‌మి ఎక్స్2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: రియల్‌మీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌మీ ఎక్స్2’ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జి గేమింగ్ ప్రాసెసర్, 64ఎంపి క్వాడ్ కెమెరా, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ కోసం ఈ ప్రాసెసర్‌ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకతలతో వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోను. రెండు వేరియంట్లలో రియల్‌మీ ఎక్స్2 (4జిబి + 64జిబి) ధర రూ.16,999 కాగా, రియల్‌మీ ఎక్స్2 (6జిబి + 128జిబి) ధర రూ.18,999గా నిర్ణయించింది.

’రియల్‌మీ ఎక్స్2’ అమ్మకాలు డిసెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్‌తో పాటు రియల్‌మీ బడ్స్ ఎయిర్‌ను కూడా విడుదల చేశారు. ఈ బడ్స్ ఎయిర్ ధర రూ.3,999. ఫీచర్ల విషయానికొస్తే.. 30డబ్ల్యూ విఒఒసి ఫ్లాష్ ఛార్జ్ 4.0, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ఇది గరిష్టంగా 2.2హెచ్‌జెడ్ వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జి ఎస్‌ఒసి శక్తిని కలిగి ఉంది.

Realme X2 launched in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మార్కెట్లోకి సరికొత్త రియల్‌మి ఎక్స్2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: