టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

 

బెంగళూరు:ఐపిఎల్ 12వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకుని, బెంగళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫాస్ట్ బౌలర్ స్టెయిన్ గాయపడడంతో అతని  స్థానంలో టిమ్ సౌథీని జట్టులోకి ఎంపిక చేశారు. ఇక, బెంగళూరు జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే అన్ని మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది. దీంతో పంజాబ్ జట్టుపై గెలిచి ప్లేఆఫ్ అశలను సజీవంగా ఉంచుకోవాలని బెంగళూరు జట్టు భావిస్తోంది.

RCB vs KXIP: KXIP won toss and opt bowl

The post టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.