రుణాలు తీసుకున్నవారికి గుడ్ న్యూస్…

ముంబయి: రుణాలు తీసుకున్నవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముంబయిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గబోతుంది. ప్రధాని మోడీ ప్రభుత్వం రెండోసారి బాధ్య‌త‌లు చేపట్టిన  అనంతరం… ఆర్బీఐ ద్ర‌వ విధానాన్ని ప్రకటించింది. రెపో రేటును […] The post రుణాలు తీసుకున్నవారికి గుడ్ న్యూస్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: రుణాలు తీసుకున్నవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముంబయిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గబోతుంది. ప్రధాని మోడీ ప్రభుత్వం రెండోసారి బాధ్య‌త‌లు చేపట్టిన  అనంతరం… ఆర్బీఐ ద్ర‌వ విధానాన్ని ప్రకటించింది. రెపో రేటును త‌గ్గించ‌డంతో, ఇప్పుడు బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే రుణాలు ఇచ్చే చాన్స్ ఉంటుంది.

దీంతో ఇఎంఐల వాటా కూడా త‌గ్గే అకాశం ఉందని విశ్లేషలకుల అంచాన. ఇళ్లు, కార్ లోన్స్ తీసుకునేవాళ్లకు, కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఇది నిజంగా తీపికబురు. రెపో రేటును 6 శాతం నుంచి 5.75 శాతానికి కుదించారు. రివ‌ర్స్ రెపో రేట‌ను 5.50, బ్యాంక్ రేటును 6.0గా ఫిక్స్ చేశారు. వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాల‌ని ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ముంబైలో ఆర్బీఐ తెలిపింది. 5గురు స‌భ్యుల మానిట‌రీ పాల‌సీ క‌మిటీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. జిడిపి వృద్ధి రేటును సైతం ఆర్బీఐ స‌వ‌రించింది. 7.2 శాతం నుండి 7 శాతానికి త‌గ్గించారు.

ఆర్‌టిజిఎస్‌, నెఫ్ట్ లావాదేవీల‌పై విధించే చార్జీల‌ను తొలగిస్తున్నట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ బెనిఫిట్‌ను ఆ బ్యాంకుల క‌స్ట‌మ‌ర్ల‌కు క‌ల్పించాల‌ని ఆర్బీఐ పేర్కొంది. ఎటిఎం వాడ‌కంపై విధించే రుసుము గురించి అధ్య‌య‌నం చేయడానికి క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్టు ఆర్బీఐ వివరించింది. ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ నేతృత్వంలో క‌మిటీ త‌న రిపోర్ట్‌ను 2 నెల‌ల్లో సమర్పించాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయడానికి ఎటువంటి చ‌ర్య‌నైనా తీసుకునేందుకు వెనుకాడ‌బోమ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ పేర్కొన్నారు.

RBI to Cut Repo Rate by 25 Basis Points

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రుణాలు తీసుకున్నవారికి గుడ్ న్యూస్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: