డిఫాల్టర్లను 30 రోజుల్లో గుర్తించాలి

సవరించిన సర్కులర్‌ను జారీ చేసిన ఆర్‌బిఐ న్యూఢిల్లీ: మొండి బకాయిలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు గాను సవరించిన సర్కులర్‌ను శుక్రవారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) జారీ చేసింది. ఎన్‌పిఎలు లేదా మొండి బకాయిలపై 2018 ఫిబ్రవరి 12న ఆర్‌బిఐ జారీ చేసిన సర్కులర్‌ను గత ఏప్రిల్ నెలలో సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈమేరకు కొత్త నిబంధనలను ఆర్‌బిఐ జారీ చేసింది. మొండి బకాయిల పరిష్కారానికి విస్తృత ఆమోదం పొందిన పాలసీని రుణ సంస్థలు అనుసరించాలని […] The post డిఫాల్టర్లను 30 రోజుల్లో గుర్తించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సవరించిన సర్కులర్‌ను జారీ చేసిన ఆర్‌బిఐ

న్యూఢిల్లీ: మొండి బకాయిలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు గాను సవరించిన సర్కులర్‌ను శుక్రవారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) జారీ చేసింది. ఎన్‌పిఎలు లేదా మొండి బకాయిలపై 2018 ఫిబ్రవరి 12న ఆర్‌బిఐ జారీ చేసిన సర్కులర్‌ను గత ఏప్రిల్ నెలలో సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈమేరకు కొత్త నిబంధనలను ఆర్‌బిఐ జారీ చేసింది. మొండి బకాయిల పరిష్కారానికి విస్తృత ఆమోదం పొందిన పాలసీని రుణ సంస్థలు అనుసరించాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. సవరించిన సర్కులర్‌లో ఆర్‌బిఐ 1రోజు డిఫాల్ట్ నిబంధను తొలగించింది. రుణ విలువ రూ.2000 కోట్లు, అంతకుమించి ఉన్నట్లయితే వాటి చెల్లింపు ఒక రోజు ఆలస్యం అయినట్లయితే పునర్నిర్మాన ప్రక్రియను చేపట్టాలి.

డిఫాల్ట్ అయిన 30 రోజుల్లో రుణ సంస్థ ఆ ఖాతాలను పరిశీలించి, పునర్నిర్మాన ప్రణాళిక ప్రారంభించాలి. గత నిబంధన అయిన రుణ సంస్థల నుంచి 100 శాతం అనుమతిని కూడా ఆర్‌బిఐ మార్చింది. మొండి బకాయిల పరిష్కారానికి ప్రస్తుతం 75 శాతం రుణ సంస్థల అనుమతి ఉంటే సరిపోతుంది. రుణ ఖాతాల్లో సమస్యాత్మకం ముందస్తుగానే గుర్తించి వాటి పరిష్కారం చూపేందుకు ఎస్‌ఎంఎ(స్పెషల్ మెన్షన్ అకౌంట్స్)లుగా మూడు విభాగాలుగా చేశారు. ఎస్‌ఎంఎ0 (1 నుంచి-30 రోజులకు రిపేమెంట్ ఓవర్‌డ్యూ), ఎస్‌ఎంఎ1 (31 నుంచి 60 రోజులకు రిపేమెంట్ ఓవర్‌డ్యూ), ఎస్‌ఎంఎ2 (61- నుంచి 90 రోజులకు రిపేమెంట్ ఓవర్‌డ్యూ) ఆర్‌బిఐ సర్కులర్‌లో పేర్కొంది. 30 రోజుల సమీక్ష కాలంలో రుణ సంస్థలు పరిష్కార వ్యూహాన్ని నిర్ణయించాలి.

ఆర్‌బిఐ కొత్త సర్కులర్ ప్రకారం..
1. మొండి బకాయిల పరిష్కారానికి రుణ సంస్థలు అన్ని కూడా విస్తృత ఆమోదిత విధానాలను అమలు చేయాలి.
2. డిఫాల్ట్‌కు ముందు అయినా రుణదాతలు రిసొల్యూషన్ ప్లాన్(ఆర్‌పి) అమలు ప్రక్రియ ప్రారంభించడం.
3. రుణగ్రహీతలకు సంబంధించిన మొత్తం రుణాలు రూ.5 కోట్లు, అంతకుపైన ఉంటే రుణదాతలు సమాచారం అందజేయాలి.
4. ఒకవేళ ఆర్‌పి అమలు చేయబడే సందర్భాల్లో రుణదాతలు అంతా ఇంటర్- క్రెడిటార్ అగ్రిమెంట్(ఐసిఎ)లోకి ప్రవేశించాలి.
5. రూ.5 కోట్లు, ఆపైన ఉన్న రుణగ్రహీతల డిఫాల్ట్ సమాచారం ప్రతి వారం రుణదాతలకు సమర్పించాల్సి ఉంటుంది.
6. ఒకరి కంటే ఎక్కువ రుణదాతలు ఉంటే రుణ సదుపాయంతో వారికి ఐసిఎ..ఆర్‌పి నిబంధనల అమలు, ఖరారు చేస్తుంది.

RBI revises NPA norms, gives banks 30 days

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డిఫాల్టర్లను 30 రోజుల్లో గుర్తించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: