కోటక్ బ్యాంక్‌కు షాక్

  రూ.2 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బిఐ ముంబై: నిబంధనలు పాటించని కారణంగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బిఐ రూ.2 కోట్ల జరిమానా విధించింది. ప్రమోటర్ల వాటాలను సంబంధించి సరైన సమాచారం అందించలేదని, వాటాల విలీనానికి సంబంధించి నిబంధనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బిఐ వెల్లడించింది. దీంతో 2 కోట్ల రూపాయల నగదు జరిమానా విధించామని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని నిబంధనల ప్రకారం, ఈ జరిమానా అమలు చేస్తున్నట్లు […] The post కోటక్ బ్యాంక్‌కు షాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రూ.2 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బిఐ

ముంబై: నిబంధనలు పాటించని కారణంగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బిఐ రూ.2 కోట్ల జరిమానా విధించింది. ప్రమోటర్ల వాటాలను సంబంధించి సరైన సమాచారం అందించలేదని, వాటాల విలీనానికి సంబంధించి నిబంధనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బిఐ వెల్లడించింది. దీంతో 2 కోట్ల రూపాయల నగదు జరిమానా విధించామని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని నిబంధనల ప్రకారం, ఈ జరిమానా అమలు చేస్తున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది. బ్యాంకులో ప్రమోటార్ల వాటా వివరాలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆర్‌బిఐ ఆదేశించింది.

ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని, నిబంధనలు పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలియజేయాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బిఐ తెలిపింది. బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా నిర్ణయించామని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ తీరుపై ఇటీవల కూడా ఆర్‌బిఐ ఆక్షేపించింది. బ్యాంకులో తన వాటాలను తగ్గించుకోవాలని కోటక్ బ్యాంక్ హెడ్ అయిన ఉదయ్ కోటక్ గతేడాదిలో ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈమేరకు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌కు సమాచారమిచ్చింది.

RBI imposes Rs 2 crore penalty on Kotak Mahindra Bank

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోటక్ బ్యాంక్‌కు షాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: