బాలీవుడ్ బ్యూటీతో రవిశాస్త్రి డేటింగ్..?

ముంబయి: తాజాగా మరో బాలీవుడ్- క్రికెట్ ప్రేమాయణంపై సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతోంది. వాళ్లేవరో తెలుసా? టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్. అవునండీ వీలిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. ప్రముఖ దినపత్రిక ముంబయి మిర్రర్ ఈ మేరకు కథనాలు కూడా ప్రచురించింది. ఆ కథనాల ప్రకారం… రవిశాస్త్రి, నిమ్రత్ జంట రహస్యంగా రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి తెలియకుండా వారు జాగ్రత్త పడుతున్నారట. అంతేగాక ఓ ప్రముఖ […]

ముంబయి: తాజాగా మరో బాలీవుడ్- క్రికెట్ ప్రేమాయణంపై సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతోంది. వాళ్లేవరో తెలుసా? టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్. అవునండీ వీలిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. ప్రముఖ దినపత్రిక ముంబయి మిర్రర్ ఈ మేరకు కథనాలు కూడా ప్రచురించింది. ఆ కథనాల ప్రకారం… రవిశాస్త్రి, నిమ్రత్ జంట రహస్యంగా రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి తెలియకుండా వారు జాగ్రత్త పడుతున్నారట. అంతేగాక ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 2015 నుంచి పలుమార్లు తమ కొత్త కార్ల లాంచింగ్ ఈవెంట్ల కోసం ఈ జంటను పిలుస్తుండడం గమనార్హం.
ఈ కార్ల లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు తెలుస్తోంది.  రవిశాస్త్రి వయసు ప్రస్తుతం 56 ఏళ్లు కాగా, నిమ్రత్‌కు 36 ఏళ్లు. ఇక గత దశాబ్ద కాలంగా తన భార్య రీతూకి దూరంగా ఉంటున్న రవిశాస్త్రి ప్రస్తుతం నిమ్రత్‌తో ప్రేమలో ఉన్నారట. అయితే తమ రిలేషన్‌షిప్‌పై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలాఉండగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన ఎయిర్‌లిఫ్ట్ సినిమాతో నిమ్రత్ పాపులర్ అయింది. ఆ తరువాత ‘ది లంచ్‌ బాక్స్‌’ మూవీతో మరో విజయం అందుకుంది. ప్రస్తుతం ఓ వెబ్‌సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రవిశాస్త్రి భారత జట్టుతోపాటు ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. 1980ల్లో కూడా రవిశాస్త్రి మరో బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. నిమ్రత్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ తాజాగా వస్తున్న వార్తలపై అటు రవిశాస్త్రి ఇటు నిమ్రత్‌ స్పందిస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Comments

comments

Related Stories: