రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు…

Ravi prakash

మనతెలంగాణ/హైదరాబాద్: ఫోర్జరి, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కేసులు ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉన్న టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ హైకోర్టు చుక్కెదురైంది. రవిప్రకాశ్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ క్రమంలో రవిప్రకాశ్ తరపు సుప్రింకోర్టు న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహూవాల్య వాదనలు వినిపించారు. నేషనల్ లా కంపెని ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తున్న క్రమంలో పోలీసులు రవిప్రకాశ్‌పై అక్రమ కేసులు పెట్టారని, ఒకే వ్యక్తిపై మూడు ప్రాంతాలలో వేర్వేరు కేసులు నమోదు చేశారని, రవిప్రకాశ్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు.

సుప్రింకోర్టు న్యాయవాది అహువాల్య వాదనలకు కౌంటర్‌గా పోలీసులు విచారణకు హాజరుకావాలని రెండు సార్లు 160 సిఆర్‌పిసి కింద నోటీసులిచ్చినా రవిప్రకాశ్ స్పందించలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. రవిప్రకాశ్ 160 సిఆర్‌పిసి నోటీసులకు స్పందించకపోవడంతో 41ఎ నోటీసులు సైతం ఇచ్చామన్నారు. వాట్సప్‌కాల్ లో రవిప్రకాశ్ అందరికీ అందుబాటులో ఉంటున్నప్పటికీ పోలీసులు విచారణకు మాత్రం హాజరుకావడం లేదని వాదించారు. ఈక్రమంలో ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం 41ఎ నోలీసుల అనంతరం ఈ స్టేజీలో రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని, ఇవ్వలేమని పోలీసుల విచారణకు రవిప్రకాశ్ సహకరించాలని ఆదేశాలిచ్చింది.

Ravi Prakash anticipatory bail petition rejected

 

The post రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.