అక్షర మేలుకొలుపు మార్నింగ్ రాగ

  భిన్న సందర్భాలలో జరిగే సంఘటనలకి ఒక్కో మనిషి ఒక్కో తీరుగా స్పందిస్తాడు. కొంత మంది లేఖ లు ద్వారా స్పందన తెలియజేస్తే మరికొంతమంది మౌఖికంగా స్పందించవచ్చు. మంచి వక్త కాకుంటే వ్యాసాల ద్వారా ఆ సందర్భం కలిగించిన భావాన్ని వ్యక్తీకరించవచ్చు. సాహిత్య కారులు కవిత ద్వారానో, కదా ద్వారానో, ఇంకా చిత్రకారులు తమ చిత్రాల ద్వారానో ఇలా భిన్న రకాలుగా వ్యక్తీకరించేందుకు వెసులుబాటు ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సమాజంలో జరిగే ప్రతి […] The post అక్షర మేలుకొలుపు మార్నింగ్ రాగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భిన్న సందర్భాలలో జరిగే సంఘటనలకి ఒక్కో మనిషి ఒక్కో తీరుగా స్పందిస్తాడు. కొంత మంది లేఖ లు ద్వారా స్పందన తెలియజేస్తే మరికొంతమంది మౌఖికంగా స్పందించవచ్చు. మంచి వక్త కాకుంటే వ్యాసాల ద్వారా ఆ సందర్భం కలిగించిన భావాన్ని వ్యక్తీకరించవచ్చు. సాహిత్య కారులు కవిత ద్వారానో, కదా ద్వారానో, ఇంకా చిత్రకారులు తమ చిత్రాల ద్వారానో ఇలా భిన్న రకాలుగా వ్యక్తీకరించేందుకు వెసులుబాటు ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సమాజంలో జరిగే ప్రతి సంఘటనకి తన జీవితంతో భాగముందని భావించే ఓ కుర్రాడి రాతల సమాహారమే ఈ ‘మార్నింగ్ రాగ’.

కళింగాంధ్ర అందులోనే ప్రత్యేకంగా శ్రీకాకుళం నుంచి కవి/రచయత/వ్యాసకర్త రావడం అంటే మాములు విషయము కాదు. అది కాక సామాజిక మాధ్యమం అయిన ముఖ పుస్తకంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ జరుగుతున్న సంఘటనలకి తన అక్షరం ఎంతవరకు చైతన్యం కలగచేస్తుందో చెక్ చేసుకుంటున్నాడు రత్నగిరి శంభుప్రసాద్. ఇందులోని వ్యాసాలన్నీ సంఘటనలే. వాటినే అక్షరబద్ధం చేసి ముందుకు వచ్చారు. ఇక ఇందులో అక్షరానికి చక్కని చిత్రాలు జతగా మరింత శోభ నిచ్చాయి.

వ్యాసాలలో చూస్తే చాలా స్ఫూర్తిని నింపేవిగా ఉంటాయి, ఓ చోట అంటాడు ‘రేఖాంశాన్ని కొలిచే సాధనం లేదు, నీలో నిలువెల్లా అహం, కొద్దిగా కష్టపడి, మరికొద్ది గా బాధపడు, అయినా ఇక్కడినుంచి వెళ్లిపోయేవరకు యుద్ధం చేయి‘ (పదితలల పరమ శివతత్వం). మనిషి మరో మనిషి ని ద్వేషిస్తూ ఎంతోకాలం మనలేడు అందుకే అహం వీడి ప్రేమతో మనుషుల్ని కల్పుకోమంటాడు. మనిషి మంచిని చెడుని విడదీసే నైజం ఇంకా రాలేదు అందుకే ద్వేషాన్ని ప్రేమతో జయించమంటాడు. జ్ఞానాన్ని పట్టుకోగలడం కష్టం అయితే ప్రయత్నిస్తే మాత్రం చిక్కకపోదు. ‘life is a myth‘ అని ఎంత చెప్పినా అందులో ను మిత్యావస్థ కూడా జ్ఞానాన్ని ఇచ్చేదే. మధ్య లో దొరికేది మధ్యలోనే పోతాయి. అంత మిధ్యగానే తోస్తుంది అనే సూడోవాదాన్ని బద్దలు కొట్టమంటాడు.

ఆగడం విధి అయితే ఆపలేకపోవడం అచేతనం అందుకే సెల్ఫ్ సెంట్రిక్ గా మారిపోతేనే బెటర్. ఈ లోకం పోకడ కాల్ల కపటం తెలియనంతవరకే బాగుంటుంది అంతకు మించి జ్ఞానం పెరిగితే, అతి గా దూసుకుపోవడం కూడా అనర్ధం అయి కూర్చుంటుంది (గ్రహాంతర జ్ఞానం). మనం మాట్లాడే భాష కి మనం ఎంత విలువ ఇస్తున్నాం, ఒక తెలుగు వాడు మరొక తెలుగువాడు కనపడితే ఆంగ్లం లో మాట్లాడుకుంటాడనే అపవాదు ని చెరిపివేయాలక చతికిల పడ్డం. అందుకే ప్రపంచం స్థాయి లో తెలుగు భాష కి ప్రాచీన హోదా వచ్చినా సొంతవాళ్ల చేతుల్లో నిరాదరణ కి గురి అవుతుంది . ‘మందారపు వెన్నెలలో ‘ ఇలా వాపోతాడు

‘మలేసియా దారులలో, బరంపురం వీధులలో తెలుగు ఉంటుంది కానీ, తెలుగు నేలపై ఉండదు అంతేగా! ముష్టి భాష కి వీర ముష్టి భాషకు ప్రపంచ స్థాయి గుర్తింపు‘ ఇలా ఉండటం మన దౌర్బాగ్యం కాదు. నాస్తికత్వం లోని కోణం, భక్తి వర్సెస్ నాస్తికత్వం గురించి నోస్టాల్జిక్ నాస్తిక వ్యాసం లో చాలా బాగా చర్చించారు. భక్తి కి నాస్తికత్వానికి పరాకాష్ట నరుడు నారాయణుడి వృత్తాంతాన్ని తీసుకొని అనలైజ్ చేయడం బాగుంది. నాస్తికత్వం కంటే జ్ఞానం గొప్పది అందుకే జ్ఞానం శరణం గచ్చామి, గెలిచిందత సత్యం కాదు, కానీ చివరికి గెలిచేది సత్యమే. నేనే బ్హ్రహ్మ నేనే విష్ణు నా తరువాతే అంతా అనే తత్త్వాన్ని వివరించినట్టు ఉన్న అంత నేనే అనే అర్ధం లో స్ఫురించడం గమనించాలి.

ఐన ఎదో ఒకరోజు మంచివాడి చేతిలో ఓటమి ఆనందమే అంటాడు. వాజపేయి కి అక్షర నివాళి అర్పిస్తూ ‘కవిత గా చూస్తే పంక్తిగా తనని తాను కుదించుకుపోయిన ఆ మనిషి ఏమైపోయాడు ‘, దేహానికి గాయాలను ఇచ్చిన కలం దేశానికో జ్ఞాపకం ఇచ్చిపోతుంది‘ (దివిలో నో దిగంతంలోనో) ఇక నాన్న గురించి ‘లైఫ్ వితౌట్ నాన్న‘ లో నాన్న తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకొంటాడు. జీవితం అలసి సొలసి ఉంటుంది ఓ కన్నీటి కెరటం బలి తీసుకుంటుంది. బాల్యంలో, యౌవ్వనమో ఎదో ఒకటి ఒకరికి గాయం మరొకరి కి జ్ఞాపకం ‘ నిజమే కాదు నాన్న అంటే జీవితం అలాంటి నాన్న లేని జీవితాన్ని ఊహాంచాలన్న కష్టమే అందుకే నాన్న నేను వేరుకాదు అని నాన్నలకి ప్రేమ పూర్వక అక్షరాన్ని బహుమతి గా ఇస్తాడు

అందరి భవిష్యత్తు ని రంగం లో చెప్పే మాతంగి తన జీవితాన్ని మాత్రం ప్రెడిక్ట్ చేయలేకపోయింది అని మాతంగుల జీవితాల వెనుక దాగి ఉన్న విషాదాన్ని తెలియచేసాడు (ఇది జీవిత ‘రంగం‘). భవిష్యత్తు ని వినిపించే ఆ తల్లి మాత్రం తన భవిష్యత్తు ని మాత్రము మార్చలేకపోతుంది ఇంత విషాదమున్న ఎప్పుడు బయటికి చెప్పాడు సంతోషాన్ని లోకానికి అందించడమే తన పని లక్ష్యం. మాతంగి కష్టాలను ఆలకించి ప్రభుత్వమైనా ఆదుకోవాలని కోరుకుంటాడు. ఎక్కడో థాయిలాండ్ లో జరిగిన సంఘటనకి ప్రాంతాలకి అతీతంగా స్పందించారు. కలిసి ఉంటే కలదు సుఖం అంటాడు. అందుకే ఒక గుహలో చిక్కుకున్న పిల్లలు జీవితం పై ఆశ తో ఎలా పోరాడి బయటికి వచ్చారు. ‘దేవుడికి కృతజ్ఞత‘ తో తాను శృతి కలుపుతాడు. ఒక గొప్ప ప్రయత్నానికి అనుపమానా సాహసానికి దేవుడు సహాయపడాలని మనసారా ప్రార్ధించారు.

వారి ప్రార్ధనలు ఫలించాయి కాబోలు చివరికి అందరు క్షేమంగా బయటకి వచ్చారు. అందుకే జీవితం చాలా చిన్నది. కష్టం వచ్చింది కదా అని తనువూ చలించకుండా పోరాడాలి .. Life is like battle, యుద్ధం చేయి, గెలుపు నీ చెంతనే ఉంటుంది .. ఇవి కేవలం కొన్ని వ్యాసాలలో ని అంశాలు మాత్రమే ఇంకా ఈ వ్యాస పరంపర లో మహానటి సావిత్రి పైన రాసిన వ్యాసం, శ్రీ శ్రీ, సన్నిలియోన్, నైనా సవైహాల్, కార్ల్ మారక్స్ పైన రాసిన వ్యాసాలు ఆలోచింపచేస్తాయి. ఈ వ్యాసాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల, వ్యవస్థ అనాసక్తి పట్ల నిరసన ఉంది, స్ఫూర్తి ని నింపుతూనే పోరాట పంధాలో వెళ్లమనే సందేశము ఉంది. ఈ సంపుటి తీసుకురావడానికి శంబు ప్రసాద్ చాలా నే కష్టపడ్డాడు. అయినా తన అక్షరాలు నలుగురిని ఆలోచింపచేస్తే చాలు అంతకన్నా విలువైనది ఏమి లేదని, చైతన్యం వైపు గా తాను నడుస్తూ నడిపించాలని కోరుకున్నాడు.

సాహిత్యం లో కళింగాంధ్ర ప్రాతినిధ్యం తక్కువే పాత తరాన్ని వదిలిస్తే, ఇప్పుడు ఇప్పుడు రాస్తున్న కొత్త రచయతలు/కవులు తక్కువే అయినా ఇప్పుడే నిలదొక్కకుకోవడానికి కృషి చేస్తున్నారు. అందులో రత్న శంభు ప్రసాద్ తప్పకుండ విజయం సాధిస్తాడు. వృత్తి వేరు అయినా ప్రవృత్తి ని ఎక్కడ మానుకోక సమాజం లో జరిగే సంఘటనలకు తాను కూడా బాధ్యత గా అక్షరం తో ప్రజలని చైతన్యవంతం చేయడానికి యత్నిస్తున్నాడు. మంచి రచనలు చేసి మరింత గా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.

Ratnagiri Shambhu Prasad Written by Morning Raga book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అక్షర మేలుకొలుపు మార్నింగ్ రాగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.