జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాథోడ్ బాబుకు స్వర్ణం

  జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మొగుడంపల్లి మండల పరిధిలోని సర్జారావుపేట్ తాండాకు చెందిన రాథోడ్ బాబు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలో బెస్ట్ సూటర్‌గా ప్రతిభను కనబర్చి అండర్– 19 విభాగంలో బంగారు పథకం సాధించారు. ఈ నెల 15 నుండి 20వ తేదీ వరకు ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లా, ప్రేమ్ నగర్‌లో వివిధ రాష్ట్రా నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. గత జులైన 14, 15 తేదీలలో […] The post జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాథోడ్ బాబుకు స్వర్ణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మొగుడంపల్లి మండల పరిధిలోని సర్జారావుపేట్ తాండాకు చెందిన రాథోడ్ బాబు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలో బెస్ట్ సూటర్‌గా ప్రతిభను కనబర్చి అండర్– 19 విభాగంలో బంగారు పథకం సాధించారు. ఈ నెల 15 నుండి 20వ తేదీ వరకు ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లా, ప్రేమ్ నగర్‌లో వివిధ రాష్ట్రా నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు.

గత జులైన 14, 15 తేదీలలో మేడ్చల్ జిల్లా, మల్కాజ్‌గిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో 2వ స్థానం సంపాదించి పురస్కారాన్ని పొందాడు రాథోడ్ బాబు. దీంతో రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ పొటీలో మంచి ప్రతిభను కనబర్చిన రాథోడ్ బాబు జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. తెలంగాణ ముద్దు బిడ్డగా రాష్ట్ర స్థాయిలో బంగారు పథకం సాధించిన రాథోడ్ బాబుకు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్‌పి. తుకారాం, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రాథోడ్, అధ్యక్షులు దేవిదార్, రాజు పవార్ మండల అధ్యక్షులు, ఎ.ఎం.సి డైరెక్టర్ రాజు సుభాష్ చంధర్‌తో పాటు తదితరులు అభినందించారు.

Rathod Babu won gold at volleyball competition

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాథోడ్ బాబుకు స్వర్ణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: