ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడి

  ముంబై: ఎలక్ట్రిక్ వెహికిల్(ఇవి) వ్యాపారం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ(ఒఇఎం)లో టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇన్వెస్ట్ చేస్తున్నారని సోమవారం ఓలా ప్రకటించింది. ఒఇఎంకు చెందిన సిరీస్ ‘ఎ’లో భాగంగా టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెడుతున్నారని పేర్కొంది. అయితే పెట్టుబడి ఎంత అనే వివరాలను వెల్లడించలేదు. ఓలా ఎలక్ట్రిక్‌లో ఆయన పెట్టుబడితో ఆయన అపార అనుభవం, సలహాదారుగా సంస్థకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ఓలా తెలిపింది. ఓలాకు చెందిన మాతృ సంస్థ ఎఎన్‌ఐ టెక్నాలజీస్‌లో […] The post ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: ఎలక్ట్రిక్ వెహికిల్(ఇవి) వ్యాపారం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ(ఒఇఎం)లో టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇన్వెస్ట్ చేస్తున్నారని సోమవారం ఓలా ప్రకటించింది. ఒఇఎంకు చెందిన సిరీస్ ‘ఎ’లో భాగంగా టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెడుతున్నారని పేర్కొంది. అయితే పెట్టుబడి ఎంత అనే వివరాలను వెల్లడించలేదు. ఓలా ఎలక్ట్రిక్‌లో ఆయన పెట్టుబడితో ఆయన అపార అనుభవం, సలహాదారుగా సంస్థకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ఓలా తెలిపింది. ఓలాకు చెందిన మాతృ సంస్థ ఎఎన్‌ఐ టెక్నాలజీస్‌లో టాటా మొదటి ఇన్వెస్టర్‌గా ఉన్నారు. 2015 జూలైలో ఎఎన్‌ఐ టెక్నాలజీస్‌లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది మార్చిలో టైగర్, మాట్రిక్స్ ఇండియా ఆధ్వర్యంలో రూ.400 కోట్ల సమీకరణ కోసం ఒఇఎ ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ వెహికిల్ పర్యావరణ వ్యవస్థ ప్రతి రోజూ అభివృద్ధి చెందుతూ వస్తోందని.. వృద్ధిలో ఓలా ఎలక్ట్రిక్ కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నామని ఈ సందర్భంగా టాటా పేర్కొంది.

Ratan Tata invests in Ola Electric Mobility

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: