మీకు ఒక విష‌యం చెప్పాల‌నుకున్నా..?

ఇటీవల వచ్చిన ‘గీత గోవిందం’తో సూపర్ హిట్ కొట్టిన కన్నడ భామ రష్మిక మందన నిశ్చితార్థంపై తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు, దర్శకనిర్మాత రక్షిత్ శెట్టితో రష్మిక గత ఏడాది జులై 3న నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా, ఇప్పుడు వినిపిస్తున్నవార్తల ప్రకారం రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుందని. దీనిపై వస్తున్న ట్రోల్స్ ను ఖండిస్తూ రష్మిక తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ మేరకు మందన ట్వీట్ చేశారు. చాలా కాలంగా నేను సైలెంట్‌గా […]

ఇటీవల వచ్చిన ‘గీత గోవిందం’తో సూపర్ హిట్ కొట్టిన కన్నడ భామ రష్మిక మందన నిశ్చితార్థంపై తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు, దర్శకనిర్మాత రక్షిత్ శెట్టితో రష్మిక గత ఏడాది జులై 3న నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా, ఇప్పుడు వినిపిస్తున్నవార్తల ప్రకారం రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుందని. దీనిపై వస్తున్న ట్రోల్స్ ను ఖండిస్తూ రష్మిక తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ మేరకు మందన ట్వీట్ చేశారు. చాలా కాలంగా నేను సైలెంట్‌గా ఉన్నందుకు క్ష‌మించండి. నాపై వ‌స్తున్న స్టోరీస్‌, ఆర్టిక‌ల్స్‌, కామెంట్స్, ట్రోల్స్ చూస్తున్నాను. వాటి వల్ల నేను ఎలా బ్లేమ్ అవుతున్నానే విష‌యం గ్రహించాను. నన్ను కూడా కొన్ని రోజులుగా ఈ ట్రోల్స్ డిస్ట్రబ్ చేస్తున్నాయి. దీనికి గాను నేను ఎవ‌రిని నిందించ‌డం లేదు. కానీ, ఒక విష‌యం చెప్పాల‌నుకున్నా. ర‌క్షిత్ లేదంటే నేను లేక మ‌రెవ‌రైన ఇండ‌స్ట్రీలో ఇలాంటి వాటిని భ‌రించ‌డం చాలా కష్టం. ప్ర‌తి నాణానికి రెండు సైడ్స్(బొమ్మ, బొరుసు) ఎలా ఉంటాయో, అలాగే ప్ర‌తి స్టోరీకి రెండు కార‌ణాలుంటాయి. ఇండ‌స్ట్రీలో మేం చేసే ప‌నుల‌కి ఆటంకం కలించకుండా ప్ర‌శాంతంగా చేసుకోనివ్వ‌డం మంచిదనేది నా అభిప్రాయమంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

ఇక ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ‘గీత గోవిందం’తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తనదైన చలాకీ నటన, అభినయంతో యువతను ఆకట్టుకోవడంతో దర్శక నిర్మాతలు ఆమె వైపే చూస్తున్నారు. తెలుగు, కన్నడ రెండు పరిశ్రమల్లోనూ రష్మికకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’, మల్టీస్టారర్ ‘దేవదాస్’లో నానితో నటిస్తోంది. కన్నడలో కూడా పలు భారీ ప్రాజెక్టులు ఒప్పకుందని సమాచారం.

Comments

comments

Related Stories: