పెళ్లి విషయంలో సుధీర్ కి ఆ మాట చెప్పాను: రష్మీ

ఫిలింనగర్: బుల్లితెరపై సందడి చేస్తూనే… మరో పక్క వెండితెరపై హీరోయిన్ గా యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది రష్మీ. అయితే, రష్మీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఒక రియాలిటీ షో కోసమే తాను సుడిగాలి సుధీర్ వివాహం చేసుకున్నట్టుగా నటించడం జరిగిందని చెప్పింది. కానీ బయట నిజంగానే తమ పెళ్లి జరిగిపోయిందని పుకార్లు వస్తున్నాయని తెలిపింది. ఏదో ఒక రోజున తను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను. అలాగే సుధీర్ కూడా […]

ఫిలింనగర్: బుల్లితెరపై సందడి చేస్తూనే… మరో పక్క వెండితెరపై హీరోయిన్ గా యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది రష్మీ. అయితే, రష్మీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఒక రియాలిటీ షో కోసమే తాను సుడిగాలి సుధీర్ వివాహం చేసుకున్నట్టుగా నటించడం జరిగిందని చెప్పింది. కానీ బయట నిజంగానే తమ పెళ్లి జరిగిపోయిందని పుకార్లు వస్తున్నాయని తెలిపింది. ఏదో ఒక రోజున తను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను. అలాగే సుధీర్ కూడా తనకి నచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అప్పుడుగానీ ఈ బైట వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పుకొచ్చింది. తను ముందుగా పెళ్లి చేసుకుంటే సుధీర్ ని మోసం చేశానని మా గురించి ఆలోచించే వాళ్లు చెప్పుకుంటారు. సుదీర్ ముందు పెళ్లి చేసుకుంటే నాకు ద్రోహం చేశాడని తప్పుగా అనుకుంటారు. పక్క పక్కనే చెరో వేదికపై ఒకేసారి పెళ్లి చేసుకుందామని నేను సుధీర్ తో చెబుతూ వుంటానని రష్మీ ఒక క్లారీటీ ఇచ్చింది.

Related Stories: