అఫ్గాన్ ఘన విజయం

చట్టోగ్రామ్ : పసికూన అఫ్గానిస్థాన్ ప్రపంచ క్రికెట్‌లో మరో పెను సంచలనం సృష్టించింది. తనకంటే బలమైన బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 224 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. అఫ్గాన్‌కు ఇది టెస్టులో రెండో విజయం. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా అఫ్గాన్ జయకేతనం ఎగుర వేసింది. ఇక, సొంత గడ్డపై బంగ్లాదేశ్ అవమానకర రీతిలో ఓటమి పాలైంది. పసికూనగా పేరున్న అఫ్గాన్ చేతిలో అనూహ్యంగా పరాజయం చవిచూసింది. […] The post అఫ్గాన్ ఘన విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చట్టోగ్రామ్ : పసికూన అఫ్గానిస్థాన్ ప్రపంచ క్రికెట్‌లో మరో పెను సంచలనం సృష్టించింది. తనకంటే బలమైన బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 224 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. అఫ్గాన్‌కు ఇది టెస్టులో రెండో విజయం. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా అఫ్గాన్ జయకేతనం ఎగుర వేసింది. ఇక, సొంత గడ్డపై బంగ్లాదేశ్ అవమానకర రీతిలో ఓటమి పాలైంది. పసికూనగా పేరున్న అఫ్గాన్ చేతిలో అనూహ్యంగా పరాజయం చవిచూసింది. చివరి రోజు ప్రతికూల వాతావరణం వల్ల ఆట చాలా సేపటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందో ఏమో అనే ఆశలతో బంగ్లాదేశ్ అభిమానులు ఉన్నారు. అయితే ఆట ప్రారంభమైన 18 ఓవర్లలోనే అఫ్గానిస్థాన్ మిగిలిన నాలుగు వికెట్లను పడగొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. విజయం కోసం 398 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్‌ను అఫ్గానిస్థాన్ బౌలర్లు తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు. అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. 49 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జహీర్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టి తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరి ధాటికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్‌లో కూడా రషీద్ ఐదు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా 136/6 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌ను అఫ్గాన్ బౌలర్లు హడలెత్తించారు. ఇటు రషీద్ అటు జహీర్ చెలరేగడంతో బంగ్లా ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన షకీబుల్ హసన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావారిలో ఓపెనర్ ఇస్లాం (41) మాత్రమే రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 342 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్ 260 పరుగులకు ఆలౌటైంది. కాగా ఆల్‌రౌండ్‌షోతో అఫ్గాన్‌ను గెలిపించిన రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ ద్వారా రషీద్ ఖాన్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యంత చిన్న వయసులో టెస్టు విజయాన్ని అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అంతేగాక సారథ్యం వహించిన తొలి టెస్టులోనే 11 వికెట్లు పడగొట్టడమే కాకుండా అర్ధ సెంచరీ సాధించిన మొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. మరోవైపు ఇప్పటి వరకు కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన అఫ్గాన్ రెండింటిలో విజయం సాధించింది. ఇదిలావుండగా బంగ్లాదేశ్ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. టెస్టు క్రికెట్ ఆడుతున్న 10 వేర్వేరు జట్ల చేతుల్లో ఓటమి పాలైన తొలి జట్టుగా చెత్త రికార్డును నెలకొల్పింది.

Rashid Khan spins Afghanistan to famous Test triumph

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అఫ్గాన్ ఘన విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: