మెగాస్టార్‌తో చేసి ఉంటే కెరీర్ పీక్ స్టేజ్‌కి వెళ్లేది

Rashi said Career would better if done with Megastar

 

కొంతమంది హీరోలకు బంగారం లాంటి అవకాశాలు ఇలా వచ్చి అలా చేజారిపోతుంటాయి. ఆ ఒక్క సినిమా చేసి ఉంటే వాళ్ల కెరీర్ మరో రేంజ్‌లో ఉండేది. ఇక ఫలానా సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్సయిందని హీరోయిన్లు బాధపడుతూ చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడలాంటిదే తన కెరీర్ లో ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఒకప్పటి హీరోయిన్ రాశి. తెలుగులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ అప్పటి స్టార్ హీరోలతో మాత్రం పెద్దగా సినిమాలు చేయలేకపోయింది. ఒక దశలో ఏకంగా చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చిందని… కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చింది.

అప్పట్లో పత్రికల్లో కూడా వచ్చిన ఈ వార్తలపై ఇంతకంటే ఎక్కువ స్పందించడం తనకు ఇష్టం లేదని, సినిమా వివరాలను చెప్పనని అంటోంది రాశి. చిరంజీవితో సినిమా చేసి ఉంటే తన కెరీర్ పీక్ స్టేజ్‌కు వెళ్లి ఉండేదని, హీరోయిన్‌గా మరో ఐదేళ్లు కొనసాగి ఉండేదాన్ని అని బాధపడింది రాశి. అయితే చిరంజీవి సరసన ఛాన్స్ రాకపోయినా.. మెగాస్టార్ తమ్ముడు పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చిందని.. ఆ క్రెడిట్ మొత్తం చిరంజీవి భార్య సురేఖకు చెందుతుందని తెలిపింది ఈ అందాల తార. కేవలం సురేఖ చెప్పడం వల్ల ‘గోకులంలో సీత’ సినిమాలో తనను హీరోయిన్‌గా తీసుకున్నారని రాశి పేర్కొంది.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెగాస్టార్‌తో చేసి ఉంటే కెరీర్ పీక్ స్టేజ్‌కి వెళ్లేది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.