భూతవైద్యం పేరుతో…

Exorcismహైదరాబాద్ : భూత వైద్యం పేరిట ఆజం అనే వ్యక్తి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బోరబండ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు తమ కూతురు(19)తో కలిసి జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో వారి కుటుంబంలో సమస్యలు వచ్చాయి. దీంతో మల్లేపల్లిలో  ఉండే భూత వైద్యుడు ఆజంను సంప్రదించారు. ఇంట్లో దయ్యం ఉండడం కారణంగానే సమస్యలు వస్తున్నాయని వారికి ఆజం చెప్పాడు. ఇంటి నుంచి దయ్యాన్ని పారదోలుతానని ఆజం వారికి హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో వారిని ఆజం బీదర్ లోని ఓ దర్గాకు తీసుకెళ్లాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని, లేనిపక్షంలో తల్లిదండ్రులు చనిపోతారంటూ ఆ యువతిని ఆజం బెదిరించాడు. ఈ క్రమంలో అతడు సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సదరు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆజంను అరెస్టు చేశారు. అయితే అతడిని ఏమీ అనకుండా పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నట్టు సదరు యువతి ఆరోపిస్తోంది. ఆజంను విడిపించేందుకు ఓ పోలీసు అధికారి యత్నిస్తున్నట్టు సదరు యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆజం నాంపల్లి  నాంపల్లిలోని ఓ దర్గా సమీపంలో భూత వైద్యురాలిగా పేరున్న మహిళకు ప్రియశిష్యుడు కావడం గమనార్హం.

Rape On Woman In Name Of Exorcism

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భూతవైద్యం పేరుతో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.