తొమ్మిదేండ్ల చిన్నారిపై అత్యాచారం…

Rapeమహబూబ్‌నగర్: నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేండ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధిత బాలిక అమ్మమ్మతో కలిసి వినాయక ఊరేగింపు చూడడానికి వెళ్లింది. ఆ సమయంలో వారి పొరుగింటి వ్యక్తి పోగుల రాజు బాలికను చూశాడు, తాను ఇంటికి వెళ్తున్నానని బైక్‌పై వెళ్దాం వస్తావా? అని అడిగాడు.

సరేనన్న బాలిక తన అమ్మమ్మకు చెప్పి బైక్‌ ఎక్కింది. బాలికను రాజు ఇంటికి తీసుకెళ్లకుండా గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఇంటి దగ్గర దింపాడు. జరిగిన విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. సమాజంలో చిన్నారుల పై జరిగే అత్యాచారాలు రోజు రోజుకు అధికం అవుతున్నాయి.

Rape on Nine Years Old Girls At Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తొమ్మిదేండ్ల చిన్నారిపై అత్యాచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.