బర్త్‌డే ఈవెంట్ పేరిట బరి తెగింపు

Rape

 

నగ్నంగా డ్యాన్సు చేయాలని బలవంతం
ఇద్దరు మహిళలపై నలుగురు యువకుల అత్యాచారం

మన తెలంగాణ / రాజేంద్రనగర్ : బర్త్‌డే ఈవెంట్ పేరుతో నలుగురు దుర్మార్గులు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. బతుకుదెరువుకు ఈవెంటర్ ఆర్గనైజర్‌గా కొనసాగుతున్న మహిళతో పాటు మరో సింగర్ ఒంటి పై వస్త్రాలను తొలగింపజేసి నర్తన చేయించారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు వారి పై అత్యాచారయత్నానికి ఒడిగట్టి, గదిలో బందీలను చేసి తమ కామ, క్రోధలను ప్రదర్శించిన తీరు ఇది. దిశ సంఘటన నేపథ్యంలో తప్పించుకుంటున్న నిందితులను ఎన్‌కౌటర్ చేసి ప్రజలమన్ననను అందుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయంగా అందిన వివరాలతో పాటు ఎసిపి అశోకచక్రవర్తి కథనం ప్రకా రం ఇద్దరు మహిళల పై నలుగురు దుర్మార్గులు చేసి అఘాయిత్యం వివరాలు ఇలా ఉన్నాయి.

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివి నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 202 సమీపంలోని నివాసం ఉండే ఆమేర్ ఈనెల 21వ తేదీన బర్తడే పార్టీ ఉందని ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసే మహిళతో ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదర్చుకున్నాడు. అలాగే ఏర్పాట్లతో పాటు పాటలు పాడించాలని ఆర్గనైజర్‌కు సూచించారు. దాంతో సదరు మహిళ ఈవెంట్ ఆర్గనైజర్ ఈవెంట్ ఏర్పాట్లు చేయించడంతో పాటు మరో మహిళ సంగర్‌ను కార్యక్రమానికి పంపింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఫుల్‌గా మద్యం చేవించిన ఆమేర్ అతని స్నేహితులు హుదార్ అలీ, సల్మాన్, సులేమాన్‌లు సింగర్‌ను డ్యాన్స్ చేయాలని ఒత్తిడి చేసారు. అందుకు ఆమె నిరాకరించడంతో అక్కడికి వచ్చిన ఆర్గనైజర్ మహిళను వారు మందలిస్తూ డ్యాన్స్ చేయాల్సిందేనని బెదిరించారు.

దాంతో సదరు బాధిత ఈవెంట్ ఆర్గనైజర్ మహిళ ఈవెంట్‌లో పాటలు పాడడం వరకు ఒప్పకున్నామని, డ్యాన్స్ చేయమని గట్టిగా చెప్పింది. దాంతో మత్తులో ఊగుతున్న ఆమేర్, హుదార్ అలీ, సల్మాన్, సులేమాన్ కత్తులతో బెదిరించి, దాడి చేసి వారి ఒంటి పై వస్త్రాలను తీయించి డ్యాన్స్ చేయించారు. లేదంటే తల్వార్‌తో నరికి చంపేస్తామని బౌతిక దాడికి దిగారు. దాంతో నలుగు దుర్మార్గుల చేరలో చిక్కిన ఆర్గనైజర్, మహిళ సంగర్ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దుండగులు చెప్పినట్లు చేశారు. అయినా వారిలోని కామ , క్రోదాలు తగ్గక ఇద్దరు మహిళల పై అత్యాచారానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే అర్థరాత్రి దాటే వరకు నలుగురు దుర్మార్గులు తమ పైశాచిక ఆనందానికి ఇద్దరు మహిళలను సభ్యసమాజం తలదించుకునేలా చేశారు. అనంతరం వారిని ఒక గదిలో బందించారు. ఎలాగొల ఉదయం ఆ గది నుంచి ఆర్గనైజన్,సింగర్ ఇద్దరు మహిళలు తప్పించుకున్నారు.

భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు
ఈవెంట్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్న మహిళ జరిగిన దుర్ఘటనను తన భర్తకు వివరించి కన్నీరుమున్నిరయింది. దాంతో భార్యకు ధైర్యం చెప్పిన భర్త బాధితురాలితో కలసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమేర్ తో పాటు మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మిగతా ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృంధాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.

Rape of four youths over two women

The post బర్త్‌డే ఈవెంట్ పేరిట బరి తెగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.