దక్షిణాఫ్రికా 126/8…గెలుపు ముంగిట భారత్

Umesh Yadav

 

రాంచీ: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ సఫారీ జట్టు తడబడుతోంది. 98 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్‌లో 162 పరుగులకే ఆలౌటై.. రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఓటమి అంచుల్లో చిక్కుకుంది. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఓపెనర్లు డికాక్(5), ఎల్గర్(15)తోపాటు హమ్జా(0), బవుమా(0), లిండె(27), పీడ్(23), క్లాసెస్(5), రబడా(12)లు ఇలా వచ్చినట్లు వచ్చి అలా పెవిలియన్ చేరారు. సఫారి టాప్ ఆటగాళ్లు ఒక్కరు కూడా క్రీజులో నిలవకపోవడం, మ్చాచ్ కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో దక్షిణాఫ్రికా ఓటమి దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు 44 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. క్రీజులో బ్రూయిన్(25), నాట్జ్(4)లు ఉన్నారు.  కాగా, ఇంకా రెండు వికెట్లే మిగిలివుండడంతో ఆటను అరగంటపాటు పొడిగించారు. టీమిండియాలో బౌలర్లలో షమీ మూడు, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. భారత్ ఇప్పటికీ ఇన్నింగ్స్‌ 209 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Ranchi Test: South Africa 126/8 in 2nd Innings against India

The post దక్షిణాఫ్రికా 126/8… గెలుపు ముంగిట భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.