‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ విడుదల

Ranarangam

 

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్‌లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల అవుతున్న విషయం విదితమే. చిత్ర ప్రచారంలో భాగంగా సినిమా సౌండ్ కట్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. మళ్లీ శర్వానంద్‌ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగే ఉంది. అతని చిత్రాల్లో ‘కో అంటే కోటి’ చిత్రం నాకిష్టం.

అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుందని అనుకునేవాడిని. ఇప్పుడు ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్‌ను చూసిన తరువాత అలాంటి చిత్రం ఇది అనిపించింది. దర్శకుడు సుధీరవర్మ ఈ చిత్రంతో తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకుంటారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్రశాంత్ పిళ్లై సంగీతం బాగుండటంతో పాటు కొత్తగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ఎడిటర్: నవీన్ నూలి.

Ranarangam Movie Soundcut Trailer Released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.