యువ హీరోలకు శర్వానంద్ ఆదర్శం

హీరో శర్వానంద్ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నితిన్ ముఖ్య అతిధి గా విచ్చేశారు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం గురువారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హీరో నితిన్ మాట్లాడుతూ “ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో45 ఏళ్ల […] The post యువ హీరోలకు శర్వానంద్ ఆదర్శం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హీరో శర్వానంద్ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నితిన్ ముఖ్య అతిధి గా విచ్చేశారు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం గురువారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హీరో నితిన్ మాట్లాడుతూ “ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో45 ఏళ్ల వ్యక్తిగా ఎలా కనిపిస్తాడని అనుకున్నాను. కానీ పోస్టర్స్, ప్రోమోస్ చూస్తుంటే అతను కరెక్ట్‌గా సెట్ అయ్యాడని అనిపించింది. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వా ఈ స్థానంలో ఉండడం నిజంగా గొప్ప విషయం. ఎంతో మంది యువ హీరోలకు అతను ఆదర్శం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను”అని తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ “సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ సుధీర్ వర్మ టేకింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలువనుంది. హీరోయిన్లు ఇద్దరూ బాగా నటించారు. కెమెరామెన్ దివాకర్ మణి విజువల్స్ హైలెట్ కానున్నాయి. సినిమా చూసి నిర్మాత వంశీ కాల్ చేశారు. చిత్రం బాగా వచ్చింది…హ్యాపీగా ఉన్నానని వంశీ చెప్పడంతో నాకు చాలా ఆనందమేసింది. సినిమా విడుదల తరువాత ప్రేక్షకులు కూడా అదే అంటారనే నమ్మకంతో ఉన్నాను”అని చెప్పారు.

దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. “నిర్మాత వంశీ ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఈ సినిమాను రూపొందించారు. కల్యాణి బాగా నటించింది. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న కాజల్‌కు థాంక్స్. శర్వా రెండు విభిన్న పాత్రల్లో బాగా నటించారు”అని అన్నారు. హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను భాగమయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ సుధీర్ వర్మ తాను అనుకున్న కథను అద్భుతంగా స్క్రీన్‌పై చూపించారు. హీరో శర్వానంద్ నాకు ఇన్‌స్పిరేషన్. ఈ సినిమా చేస్తున్నప్పుడు తన దగ్గర చాలా నేర్చుకున్నాను. కాజల్‌తో కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయం. ‘రణరంగం’ చిత్రం అందరినీ అలరిస్తుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, కెమెరామెన్ దివాకర్ మణి తదితరులు పాల్గొన్నారు.

Ranarangam movie pre release event

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యువ హీరోలకు శర్వానంద్ ఆదర్శం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: