యస్ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటాల సేల్

Rana Kapoor

 

3 శాతం పతనమైన షేరు విలువ

న్యూఢిల్లీ : యస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్, రాణా కపూర్‌లు తమ వాటాలను విక్రయించారని ప్రైవేటురంగ యస్ బ్యాంక్ సోమవారం వెల్లడించింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ తన 2.04 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఈ వాటాల అమ్మకం తర్వాత బ్యాంకులో రానా కపూర్ వాటా 0.8 శాతానికి పడిపోయింది. నవంబర్ 13- నుంచి 14 తేదీలలో ప్రమోటర్లు మొత్తం 2.04 కోట్ల షేర్లను విక్రయించినట్లు యస్ బ్యాంక్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. ఇప్పుడు వారికి మొత్తం 900 షేర్లు మిగిలి ఉన్నాయి. రాణా కపూర్ వాటాలను విక్రయించారనే వార్తలు వెలువడడంతో బ్యాంక్ షేర్లు 2.66 శాతం క్షీణించి రూ.64.15 వద్ద ముగిశాయి.

అంతకుముందు యస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్, రానా కపూర్ సెప్టెంబర్ 26న 552 లక్షల షేర్లను అమ్మారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ తన 3.92 శాతం వాటాను సెప్టెంబర్ చివరిలో విక్రయించింది. దీని తర్వాత నవంబర్‌లో స్టాక్ మార్కెట్లో ప్రధాన పెట్టుబడిదారుడు రాకేశ్ ఘున్‌ఘున్‌వాలా రూ .86.89 కోట్ల విలువైన 1.30 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. రాణా కపూర్ 2018 సెప్టెంబర్‌లో యస్ బ్యాంక్ షేర్లను వజ్రాలతో పోల్చారు. అంతకుముందు ఇతర ప్రైవేట్ బ్యాంకుల కంటే అత్యధికంగా కపూర్, ఆయన కుటుంబానికి యస్ బ్యాంక్‌లో 10.66 శాతం వాటాలు ఉన్నాయి.

Rana Kapoor stake in Yes Bank falls 0.8% more

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యస్ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటాల సేల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.