ప్రభాస్ మూవీలో ప్రత్యేక పాత్రలో రానా

Rana in a special role in Prabhas movie

 

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో రానా ప్రత్యేక పాత్రలో రెండు నిముషాల పాటు కనిపించబోతున్నాడట. అతని పాత్ర సినిమాలో ఓ హైలైట్‌గా ఉంటుందట. ఇక ఈ సినిమాకి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక లాక్ డౌన్‌కి ముందు జార్జియాలో చిత్రీకరణ చేసిన ఫిల్మ్‌మేకర్స్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు.

కాగా మిగిలిన బ్యాలెన్స్ పార్ట్‌ను జూలై రెండవ వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు. దానికి సంబంధించిన సెట్ నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టారట. మిగిలిన షూటింగ్ మొత్తాన్ని దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట. ఇక చిత్ర బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని తెలిసింది.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రభాస్ మూవీలో ప్రత్యేక పాత్రలో రానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.