కాబోయే సతీమణితో రానా.. ఫోటోలు వైరల్

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన ప్రేమను అంగీకరించిందని మిహీకా బజాజ్ తో కలిసి ఉన్న ఫోటోను రానా అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా వీరి పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు ఇరుకుంటుంబాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా రానా ‘ఇట్స్ అఫీషల్’ అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇందులో రానా, మిహీకాలు సంప్రదాయ దుస్తువుల్లో కనిపించి అందరిచేత వావ్ […] The post కాబోయే సతీమణితో రానా.. ఫోటోలు వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన ప్రేమను అంగీకరించిందని మిహీకా బజాజ్ తో కలిసి ఉన్న ఫోటోను రానా అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా వీరి పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు ఇరుకుంటుంబాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా రానా ‘ఇట్స్ అఫీషల్’ అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇందులో రానా, మిహీకాలు సంప్రదాయ దుస్తువుల్లో కనిపించి అందరిచేత వావ్ అనిపిస్తున్నారు. ఈ ఫోటోలో చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఈ జంట‌కి ప‌లువురు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ప్రస్తుత వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా, ఈనె 20న(నిన్న) రానా, మిహీకా బ‌జాజ్‌ల నిశ్చితార్ధం జ‌ర‌గింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను సురేష్ బాబు ఖండించారు.  ‘బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు రానా, మిహీకాల నిశ్చితార్ధం జ‌ర‌గ‌లేదు. రెండు కుటుంబాలు క‌లిసి నిశ్చితార్ధం, పెళ్లి గురించి చ‌ర్చించుకున్నాం. ఇందుకోస‌మే వారు ముంబయి నుండి హైద‌రాబాద్‌కి వ‌చ్చారు.  వ‌చ్చే ఏడాది రానా, మిహీకాల పెళ్లి చేయాలనుకుంటున్నాం’ అని సురేష్ బాబు తెలిపారు.

Rana and Miheeka Bajaj pre wedding photos viral

 

 

The post కాబోయే సతీమణితో రానా.. ఫోటోలు వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: