పేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్స్

20 నుంచి పంపిణీ : షానవాజ్ ఖాసిం హైదరాబాద్: రాష్ట్రంలోని పేద ముస్లిం ప్రజలు పండుగ(ఈదుల్ ఫితర్)కు ముందే సిద్ధ్దమయ్యే విధంగా రంజాన్ స్పెషల్ కానుకల పంపిణీకి రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సిద్ధమైంది. రంజాన్ గిఫ్ట్‌లో కుటుంబ సభ్యలకు సరిపడా బట్టలను అందిస్తారు. తెలంగాణ టెస్కొ సౌజన్యంతో తయారు చేసిన నాణ్యమైన వస్త్రాలను పంపిణికి సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే రంజాన్ మాసం ఊపవాసదీక్షలు ఆరంభమై వారం రోజులు పూర్తి కావడంతో మైనార్టీ వ్యవహారాల శాఖ రంజాన్ గిఫ్ట్ […] The post పేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
20 నుంచి పంపిణీ : షానవాజ్ ఖాసిం

హైదరాబాద్: రాష్ట్రంలోని పేద ముస్లిం ప్రజలు పండుగ(ఈదుల్ ఫితర్)కు ముందే సిద్ధ్దమయ్యే విధంగా రంజాన్ స్పెషల్ కానుకల పంపిణీకి రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సిద్ధమైంది. రంజాన్ గిఫ్ట్‌లో కుటుంబ సభ్యలకు సరిపడా బట్టలను అందిస్తారు. తెలంగాణ టెస్కొ సౌజన్యంతో తయారు చేసిన నాణ్యమైన వస్త్రాలను పంపిణికి సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే రంజాన్ మాసం ఊపవాసదీక్షలు ఆరంభమై వారం రోజులు పూర్తి కావడంతో మైనార్టీ వ్యవహారాల శాఖ రంజాన్ గిఫ్ట్ ప్యాక్ తయారి, పంపిణీకి సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసిందని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం మంగళవారం మీడియాతో చెప్పారు.

ఈ గిఫ్ట్ ప్యాక్ నందు టెస్కో తయారి దుస్తులు అందిస్తారు. మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి మైనార్టీ సంక్షేమ శాఖకు కేటాయించిన రూ.2వేల కోట్ల బడ్జెట్ నిధులలో తొలి త్రైమాసిక నిధుల క్రింద రూ.573 కోట్లు విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి విడియో కాన్పరెన్స్ ద్వారా ౩2 జిల్లా ల కలెక్టర్‌లు, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్‌కు రంజాన్ స్పెషల్ కార్యక్రమాల నిర్వహణ తీరు తెన్నుల పై దశ దిశ నిర్ధేశించారని ఆయన తెలిపారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంజాన్ గిఫ్ట్ ప్యాకుల పంపిణి జాబితాను గ్రేటర్ కమిషనర్ కార్యాలయం ఈ నెల 18వ తేదీ వరకు సమర్పించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయగా, ఈ నెల 20వ తేదీ నుంచి గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంజాన్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ నాంపల్లి హజ్ భవన్‌తో పాటు రాజేంద్రనగర్ పరిసరాల్లోను సెంట్రల్ జోనల్ కమిషనర్ కార్యలయం పరిధిలో ప్రత్యేక పంపిణీకేంద్రాలను సిద్ధంచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 32 జిల్లాల పరిధిలో రంజాన్ గిఫ్ట్ ప్యాకుల ను ఈ నెల 20 నుంచి 25వ తేదిల్లో అందించే విధంగా చర్యలను తీసుకోవాలని ఆయా జిల్లా కల్టెక్టర్‌ల తెలిపారు.. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందించాలని లక్షంగా నిర్ధేశించుకున్నట్లు సిఇఓ వెల్లడించారు.

832 మసీదుల్లో ఇఫ్తార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 832 మసీదుల్లో ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు మైనార్టీ వ్యవహారాల శాఖ ప్రణాళిక ఖరారు చేసింది. ఒక్కొక్క మసీదు లో 500 మందికి ఇఫ్తార్ విందులో భాగస్వామ్యం చేసేవిధంగా ప్రణాళిక ఖరారు చేశారు. ఇందులో ప్రతి మసీదుకు రూ.1లక్ష కేటాయిస్తున్నారు. ప్రతి నిమోజకవర్గం పరిధిలోని కనీసం నాలుగు ప్రాంతాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని శాసన సభ్యుల నియోజక వర్గాల్లో 96 మసీదులు, 150 మున్సిపల్ డివిజన్‌ల పరిధిలో 300 మసీదుల్లో ఇఫ్తార్ విందు నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతాయని ఆయన తెలిపారు.

Ramzan gift packs for poor Muslims in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: