ఇప్పపూవులోని తేనెబిందువు ‘బల్దేర్‌బండి’

తండా జీవితాలను, విభిన్నమనస్తత్వాలను, వారి సుఖదుఃఖాలను ‘బల్దేర్ బండి’లో ఆవిష్కరించాడు రమేష్ కార్తీక్. తన చుట్టూ ఉన్న తండా సమాజాన్ని లోతుగా పరిశీలించి రాసిన కవితా సంపుటి ఇది. చిన్న వయసులోనే అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్న యువ కవిని దునియా పలకరించింది నేను రమేశ్ కార్తీక్ నాయక్, నాకిద్దరు తమ్ముళ్లు నేనే పెద్ద. అమ్మ సేవంత, నాన్న మొజిరం మా ది వివేక్ నగర్ తండా జక్రాన్పల్లి . ఓ అరవై నుండి డెభ్భై ఇళ్లుంటాయి. అక్షరాస్యులు […] The post ఇప్పపూవులోని తేనెబిందువు ‘బల్దేర్‌బండి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తండా జీవితాలను, విభిన్నమనస్తత్వాలను, వారి సుఖదుఃఖాలను ‘బల్దేర్ బండి’లో ఆవిష్కరించాడు రమేష్ కార్తీక్. తన చుట్టూ ఉన్న తండా సమాజాన్ని లోతుగా పరిశీలించి రాసిన కవితా సంపుటి ఇది. చిన్న వయసులోనే అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్న యువ కవిని దునియా పలకరించింది

నేను రమేశ్ కార్తీక్ నాయక్, నాకిద్దరు తమ్ముళ్లు నేనే పెద్ద. అమ్మ సేవంత, నాన్న మొజిరం మా ది వివేక్ నగర్ తండా జక్రాన్పల్లి . ఓ అరవై నుండి డెభ్భై ఇళ్లుంటాయి. అక్షరాస్యులు కూడా వ్యవసాయం చెయ్యాల్సిందే…. లేకుంటే దుబాయ్… ఓ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారంతే.

తండా వాతావరణం :

చెప్పుకోదగ్గదేం కాదు. పెంకుటిల్లు, చూద్దామన్నా కనిపించని మనుషులు. మనుషులకు బదులు కో తులు కనిపిస్తాయి. ఒకప్పుడు అడివిలాగా ఉండేది. ఇప్పుడు ఎడారైంది. హైవే రోడ్ NH 44 మా తండాని పగిలిన ఇండా (గుడ్డు)గా మార్చేసింది.

అదేంటి మనుషులు కనిపించరా?

అవును పొద్దున్నే ఆరు ఆరున్నరకి పొలాలకో ఇంకే దో పనికని గంజి తాగి వెళ్ళిపోతారు. ఇక (యాడి) అమ్మలంటారా పొద్దున్న 3కి లేచి కూరగాయల్ని రోడ్డు మీదేసుకుని ఆటోలో జాగ కోసం నిరీక్షిస్తూ.. ఇలా ఎవరికీ వారు యంత్రాల కంటే హీనంగా జీవిస్తున్నారు. పొలాలున్నాయని ఆ మాత్రం ధైర్యంగా జీవిస్తున్నారు.
పండుగలు :
చాలా ఉన్నాయి. జరుపుకుంటున్నాం మొక్కుబడి గా. ఒకప్పటి ఉత్సాహం, పట్టుదల అన్నీ పోయా యి. మేం తీజ్ పండగ జరుపుకోం. శీత్ళా ఒకటే చేసుకుంటాం. పండగని ఆస్వాదించే మనుషులు తక్కువైపోయారు. నా వయసు వాళ్ళు చాలా మం ది దుబాయ్ లోనే ఉన్నారు. ఆడపిల్లలందరి పెళ్లిళ్లు అయిపోయాయి. ఒక వేళ జరిపిన ఓ గంట కోసం పండగ రెంటుకి వస్తారు పోతారు. మనస్ఫూర్తిగా ఓ ఆట, పాట, నవ్వులు కనిపించవు.

మీ పుస్తకం :
‘బల్దేర్ బండి’ నా మొదటి కవితా సంపుటి. నా అ నుకున్న తండా వేదనకి, దాని మూడో నమ్మకానికి, భయానికి, ఊహలకి, అక్షర రూపం అని అనవచ్చు.

బల్దేర్ బండి అంటే :

ఎడ్ల బండి అని అర్థ్ధం. గిరిజనుల్లో ఎన్నో తెగలున్నా యి, వాటిలో మేము బంజారాలం. మాకు ఈ బండి లేకుంటే ఊపిరాడదు, మేము బల్దేర్ బండ్లమే, దాని చక్రాలు గీతల్లో కాలాన్ని వెతుక్కుంటాం.

పుస్తకానికి ప్రేరణ :

ప్రేరణ అంటే ఏమో తెలీదు, సాధారణంగా ఏవో రాసుకుంటున్న టైమ్‌లో మహాశ్వేతా దేవి చనిపోవడం. ఆమె లాగా నువ్వూ రాయు అని ఓ శ్రేయోభిలాషి చెప్పడం, ఫేస్‌బుక్‌లోని కవిసంగమానికి పరిచయం చెయ్యడం.. అలా ఎఫ్‌బిని ఒక వేదికగా మార్చుకున్నాను.

ఈ మధ్య కేంద్ర సాహిత్య అకాడమీ గిరిజన సదస్సులో పాల్గొన్నట్లున్నారు?

అవును, ఒకే తల్లి బిడ్డలందరం సాహిత్యం ద్వారా కలుసుకున్నాం, మా జీవితాలు మాకేం కొత్త కాదు కాని ఏదో తెలియని ఆనందాన్ని పొందాను.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

ఇంటర్ పూర్తి చేసి ఎం. ఎన్. ఆర్ ఎలిమెంటరీ టీచ ర్ ఎడ్యుకేషన్ కాలేజీలో టీచర్ ట్రైనింగ్ మొదటి సంవత్సరం చేస్తున్నాను.
తండాలో మార్పు కోరుతున్నారా?

మా వాళ్ళందరూ కోరుతున్నారు. కాని మార్పు అ నేదే తెలీదు కాబట్టి ఏది మారట్లేదు, సంతోషం ఏం టంటే తండాలన్నీ ఇప్పుడు గ్రామ పంచాయతీలయ్యాయి. మొన్నటి దాకా వేరే వాళ్ళు పాలించారు. కాని ఇప్పుడు మమ్మల్ని మేము పాలించుకునే అవకాశం వచ్చింది. ఇంకో 3 సంవత్సరాల్లో మార్పు క నిపించవచ్చు, ఎడారి అడవి కావచ్చు.

సాహిత్యం వైపు ఎలా మళ్లారు?

బోధన్‌లో విజయ్ సాయి స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు, పెయింటింగ్స్ వేసి వాటికి పైనా రెం డు లైన్లు రాసే వాడ్ని. శిరీషా, పద్మలత, విజయల క్ష్మి మేడం ఎస్వంత్ సార్ ప్రోత్సాహంతో బొమ్మలతో పాటూ కవిత్వం వచ్చింది. అనే కా దు చెప్పుకోదగ్గ గిరిజన సాహిత్యం రాలేదు. రాసుకోవడానికి చాలా ఉంది కాని రాసిన తర్వాత ఏం చేయాలో తెలీదు.

ప్రపంచం మారిపోయి కొత్త దారుల్ని వేస్తుంటే మా వాళ్ళు మాత్రం ఇంకా అవే నమ్మకాల్ని గుడ్డిగా నమ్ముతూ గతంలోనే జీవిస్తున్నారు. సమాజంజం ఎంత సేపు రిజర్వేషన్స్‌నే గుర్తు చేస్తుంటాయి, దానితో విద్యనే ఆర్జిస్తున్నాం తప్పిం చి ఇంకేం కాదు. మేము వలస వాదులం కాదు, మేమంతా ఇక్కడే పుట్టి పెరిగాము.

The post ఇప్పపూవులోని తేనెబిందువు ‘బల్దేర్‌బండి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.