వాటిలో ఎలాంటి నిజం లేదు

  ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో బిజీ అయి రామ్‌చరణ్ నిర్మాతగా తన తండ్రి చిరంజీవి 152వ సినిమాను అస్సలు పట్టించుకోవడం లేదనే వార్త ఈ మధ్య చక్కర్లు కొట్టింది. అయితే ఈ గాసిప్‌పై తాజాగా చిరంజీవి 152వ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వివరణనిచ్చింది. “నిర్మాతగా రామ్‌చరణ్‌తో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ప్రతి విషయంలోనూ ఆయన మాకు సహకరిస్తూనే ఉన్నారు. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ ఇద్దరం కలిసి చర్చించుకొని […] The post వాటిలో ఎలాంటి నిజం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో బిజీ అయి రామ్‌చరణ్ నిర్మాతగా తన తండ్రి చిరంజీవి 152వ సినిమాను అస్సలు పట్టించుకోవడం లేదనే వార్త ఈ మధ్య చక్కర్లు కొట్టింది. అయితే ఈ గాసిప్‌పై తాజాగా చిరంజీవి 152వ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వివరణనిచ్చింది. “నిర్మాతగా రామ్‌చరణ్‌తో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ప్రతి విషయంలోనూ ఆయన మాకు సహకరిస్తూనే ఉన్నారు. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ ఇద్దరం కలిసి చర్చించుకొని తుది నిర్ణయాలు తీసుకుంటున్నాం.

హీరోగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగానూ చరణ్ ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉంటాడు. ఈ విషయంలో ఇంతవరకూ ఏవైతే గాసిప్స్ వచ్చాయో వాటిలో ఎలాంటి నిజం లేదు” అని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తరపున నిర్మాత నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపోతే చిరు 152వ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా కాజల్, అనుష్క పేర్లు పరిశీలిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చరణ్ నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

 

Ramcharan said about chiranjeevi movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాటిలో ఎలాంటి నిజం లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: