చరణ్ నిర్మాతగా తారక్ మూవీ…?

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా సినిమాలు చేస్తూనే చిత్ర నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చెర్రీ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్లో తొలి చిత్రంగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ను నిర్మించాడు చరణ్. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి చెర్రీకి మంచి లాభాలు తెచ్చి పెట్టింది. దాంతో తన బ్యానర్ లో రెండో చిత్రంగా కూడా చిరు మూవీనే […]

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా సినిమాలు చేస్తూనే చిత్ర నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చెర్రీ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్లో తొలి చిత్రంగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ను నిర్మించాడు చరణ్. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి చెర్రీకి మంచి లాభాలు తెచ్చి పెట్టింది. దాంతో తన బ్యానర్ లో రెండో చిత్రంగా కూడా చిరు మూవీనే ఎంచుకున్నాడు. ప్రస్తుతం 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో చరణ్ ‘సైరా నర్సింహారెడ్డి’  చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ తో మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. దీంతో ఈ చిత్రం సైతం చెర్రీకి లాభాల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలాఉండగా తాజాగా చరణ్ తన బ్యానర్ లో మూడో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రొడక్షన్స్ లో మూడో మూవీ యంగ్ టైగర్ ఎ టిఆర్ తో ఉంటుందని, అటువైపుగా చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇంతకుముందే మెగాపవర్ స్టార్ తన బ్యానర్లో బయట హీరోలతో కూడా మూవీలు చేస్తానని ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే ఆయన తారక్ తో ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎ టిఆర్, చరణ్ మంచి స్నేహితులు కావడంతో తన ప్రొడక్షన్ హౌస్ లో మూవీ చేయమని చెర్రీ అడగ్గానే తారక్ మరో మాటలేకుండా ఓకే చెప్పాడని  తెలిసింది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం చరణ్ , తారక్ లలో ఎవరో ఒక్కరు నోరు విప్పితే కానీ తెలియదు. మరోవైపు చరణ్, తారక్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.

Comments

comments

Related Stories: