ఒళ్లుగగుర్పొడిచే విధంగా సీన్స్

Ram Charan

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడు. అయితే ఆ పాత్ర ఏంటి? ఆ పాత్ర ఎంత సమయం ఉంటుంది? కథలో ఆ పాత్ర ప్రాముఖ్యత ఎంత? అనే విషయంలో ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రాలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ నుండి ఫస్ట్ లుక్ రాబోతున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో చరణ్ పాత్ర గురించి మరోసారి ప్రచారం మొదలైంది. చరణ్ పాత్ర కేవలం అర్థ గంట ఉంటుందని… ఆ అర్థ గంట సమయంలో ఒళ్లుగగుర్పొడిచే విధంగా సీన్స్ ఉంటాయని అంటున్నారు. కొరటాల ప్రత్యేకమైన శ్రద్ధతో చరణ్ సీన్స్‌ను రాశాడని తెలిసింది. చిరంజీవి, రామ్‌చరణ్ కలయిక సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉంటాయట. ‘ఆచార్య’లో చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందట.

Ram Charan to Play Powerful Role in Acharya?

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఒళ్లుగగుర్పొడిచే విధంగా సీన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.