సల్మాన్ కోసం మరోసారి చెర్రీ డబ్బింగ్…

Charan And Salman Khanముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. స‌ల్మాన్ ఖాన్ హైద‌రాబాద్‌కి వ‌స్తే చిరంజీవిని లేదంటే రామ్ చ‌ర‌ణ్‌ని క‌ల‌వకుండా వెళ్ళ‌రు. గ‌తంలో సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సిన్మాలో స‌ల్మాన్‌కి రామ్ చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్పి త‌మ స్నేహాన్ని మ‌రింత బలోపేతం చేసుకున్నారు. ఇక మ‌రోసారి స‌ల్మాన్‌కి చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్పేందుకు రెడీ అయ్యాడని ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ ముఖ్య పాత్ర‌లలో తెరకెక్కుతున్న సిన్మా భారత్. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ చిత్రానికి మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ ‘భారత్’. సల్మాన్‌ సోదరి పాత్రలో మరో హీరోయిన్ దిశా పటానీ నటిస్తోంది. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర యూనిట్.

హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సిన్మాని రిలీజ్ చేయానున్నారట. తెలుగు భాష‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తే స‌ల్మాన్ పాత్రిక రామ్ చ‌ర‌ణ్‌తో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ని సమాచారం. భార‌త్ సిన్మాలో స‌ల్మాన్ పలు గెటప్స్‌లో సంద‌డి చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే స‌ల్మాన్‌కి సంబంధించి ప‌లు లుక్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రేక్షకులలో భారీ అంచ‌నాలు పెంచింది.

ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనల సమాహారంగా భార‌త్‌ని తెరపైకి తెెస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వస్తున్న సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో భార‌త్‌తో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Ram Charan Dubbing For Salman Khan Bharat

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సల్మాన్ కోసం మరోసారి చెర్రీ డబ్బింగ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.