క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘రాక్షసుడు’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది ఈ చిత్రం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత హవీష్ కోనేరు మాట్లాడుతూ “తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘రాక్షసన్’ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’గా రీమేక్ […] The post క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘రాక్షసుడు’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది ఈ చిత్రం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత హవీష్ కోనేరు మాట్లాడుతూ “తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘రాక్షసన్’ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’గా రీమేక్ చేస్తున్నాం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్‌గా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈ సినిమాను ఆగస్టు 2న విడుదల చేస్తున్నాం”అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరాః వెంకట్ సి.దిలీప్, సంగీతంః జిబ్రాన్, ఆర్ట్‌ః గాంధీ నడికొడికర్.

Rakshasudu Movie Release on August 2

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: