రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూత

Rajya Sabha MP Amar Singh Passed Awayఢిల్లీ : రాజ్య‌స‌భ సభ్యుడు, యుపి మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమ‌ర్‌సింగ్ (64) శనివారం కనుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన నాలుగు నెలలుగా సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. అమర్ సింగ్ కు భార్య పంకజా కుమారీ సింగ్, ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. 2013లో ఆయన కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్ననేతగా అమర్ సింగ్ కు పేరుంది. 2020 మార్చిలో ఆయన చనిపోయినట్టు పుకార్లు వచ్చాయి. దీంతో టైగర్ జిందా హై అని అమర్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అమర్ సింగ్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.