క్రేజీ కాంబినేషన్‌లో మూవీ?

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లు పైబడినా వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతంతో పోల్చితే ఆయన సినిమాలు చేయడంలో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడు శివతో ‘అన్నాత్తే’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. కాగా రజనీ నెక్స్ మూవీపై ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం అవుతోంది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి డైరెక్టర్, హీరోగా ఎదిగిన రాఘవ లారెన్స్ సూపర్ […] The post క్రేజీ కాంబినేషన్‌లో మూవీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లు పైబడినా వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతంతో పోల్చితే ఆయన సినిమాలు చేయడంలో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడు శివతో ‘అన్నాత్తే’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. కాగా రజనీ నెక్స్ మూవీపై ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం అవుతోంది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి డైరెక్టర్, హీరోగా ఎదిగిన రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఓ మూవీ చేయనున్నారట. లారెన్స్ దర్శకత్వంలో ఈ సూపర్‌స్టార్ తన 169వ చిత్రాన్ని చేస్తారని అంటున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ చిత్ర పరిశ్రమలో ఈ టాక్ వినిపిస్తోంది. లారెన్స్ ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో ‘లక్ష్మీ బాంబ్’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు.

Rajinikanth 170th Movie with Raghava Lawrence?

The post క్రేజీ కాంబినేషన్‌లో మూవీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: