నాన్న నటనలోని ప్రతి కోణం నాకు నచ్చుతుంది…

  శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’. అర్జున్, కార్తీక్‌ల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్‌తో ఇంటర్వ్యూలో విశేషాలు… చాలా కష్టపడ్డాం… హీరోగా నా మొదటి సినిమా ‘రాజ్‌దూత్’ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో […] The post నాన్న నటనలోని ప్రతి కోణం నాకు నచ్చుతుంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’. అర్జున్, కార్తీక్‌ల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్‌తో ఇంటర్వ్యూలో విశేషాలు…

చాలా కష్టపడ్డాం…
హీరోగా నా మొదటి సినిమా ‘రాజ్‌దూత్’ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో చిత్రీకరణ చేశాం. నిర్మాత కూడా ఈ చిత్ర నిర్మాణం కొరకు చాలా కష్టపడ్డారు. ఇక కేవలం ఒత్తిడి తగ్గించడానికే సినిమా షూటింగ్‌ను ఎటువంటి ప్రచారం లేకుండా రహస్యంగా చిత్రీకరించడం జరిగింది.

నాన్న కోరిక మేరకు…
చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టి పెరిగినవాడిగా నాకు సినిమాపై ప్యాషన్ ఉంది. అలాగే నాన్న కూడా ఓ సందర్భంలో చిన్నవాడిని యాక్టర్‌ని, పెద్దవాడిని డైరెక్టర్‌ని చేస్తానని అన్నారు. దాంతో ఆయన కోరిక మేరకు కూడా హీరో అయ్యాను.

రెండు, మూడు జోనర్లలో సాగే…
ఈ మూవీలో హీరో తనకిష్టమైన రాజ్‌దూత్ బైక్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై అన్వేషిస్తూ ఉంటాడు. సినిమాలో కొంత భాగం రోడ్ జర్నీలో సాగుతుంది. అయితే ఇది థ్రిల్లర్ మూవీ కాదు. రెండు, మూడు విభిన్న జోనర్లలో సాగే ఓ వైవిధ్యమైన కమర్షియల్ చిత్రం అని చెప్పవచ్చు.

అమ్మకు నచ్చింది…
నేను హీరో కాగానే అమ్మ చాలా సంతోషించారు. అలాగే సినిమా ఎలా వస్తుందో అని కొంచెం కంగారు కూడా పడ్డారు. అయితే నేను ఈ సినిమాను అమ్మకు చూపించాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. మా నాన్న నటనలోని ప్రతి కోణం నాకు నచ్చుతుంది. ఎమోషనల్ అయినా యాంగ్రీ సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది.

అద్భుతంగా తెరకెక్కించారు…
దర్శకులు అర్జున్, కార్తీక్‌లు డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశారు. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసింది. అలా ఏం కాకుండా ఇద్దరు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

అన్ని ఎలిమెంట్స్‌తో…
ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్, లవ్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. జర్నీ కేవలం చిత్రంలో ఒక భాగం మాత్రమే. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది.

Rajdoot movie as hero of Srihari’s son Meghamsh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నాన్న నటనలోని ప్రతి కోణం నాకు నచ్చుతుంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: