రాజ్యసభ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…?

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిపిందే. సోమవారం ఆయన బిజెపి అగ్రనేతలతో భేటీ అవుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయాలని, బిజెపి నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బిజెపి అగ్రనేతలు రాజగోపాల్ రెడ్డికి గట్టి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల నాటికి తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు […] The post రాజ్యసభ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిపిందే. సోమవారం ఆయన బిజెపి అగ్రనేతలతో భేటీ అవుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయాలని, బిజెపి నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బిజెపి అగ్రనేతలు రాజగోపాల్ రెడ్డికి గట్టి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల నాటికి తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు ప్రత్యమ్నాయంగా ఎదగాలని బిజెపి భావిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల్లోని అసంతృప్త నేతలను బిజెపిలోకి తీసుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో బిజెపి అగ్రనేతలు కాంగ్రెస్ నేతలైన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, మునుగోడు ఎంఎల్ఎ రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి సోదరులతో బిజెపి అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి సోదరులు మాత్రం ఇప్పటి వరకు బిజెపిలో చేరికపై స్పందించలేదు.

Rajagopal Reddy As Rajya Sabha Member

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాజ్యసభ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.