ఇప్పుడు నాకే పదవులు వద్దు, ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండను…

నల్గొండ: ఇప్పుడు నాకే పదవులు వద్దు, ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను నమ్ముకున్న ప్రజల కోసమే బిజెపిలోకి చేరనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మరో వారంలో అధికారికంగా బిజెపిలో చేరబోతున్నానన్నారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించానని […] The post ఇప్పుడు నాకే పదవులు వద్దు, ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నల్గొండ: ఇప్పుడు నాకే పదవులు వద్దు, ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను నమ్ముకున్న ప్రజల కోసమే బిజెపిలోకి చేరనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మరో వారంలో అధికారికంగా బిజెపిలో చేరబోతున్నానన్నారు.
ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించానని చెప్పారు. టీ కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ పదవి తాను కోరుకున్న ముచ్చట నిజం కాదన్నారు. ఇప్పుడు మాత్రం తనకు ఎటువంటి పదవులు వద్దని, పదవి ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండనని కుండబద్దలు కొట్టారు. మద్దతుదారులంతా తనవెంటే ఉన్నారని చెప్పుకొచ్చిన ఆయన రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Raj Gopal Reddy sensational comments on Congress

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇప్పుడు నాకే పదవులు వద్దు, ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.