శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్ ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “శ్రీహరి, శాంతిల తనయుడు మేఘామ్ష్ హీరోగా పరిచయమవుతుండడం చాలా సంతోషంగా ఉంది. సినిమా టీజర్, రషెస్ చూశాను. మేఘామ్ష్‌లో మంచి ఈజ్ ఉంది. శ్రీహరి కన్నా పదిరెట్లు […] The post శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్ ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “శ్రీహరి, శాంతిల తనయుడు మేఘామ్ష్ హీరోగా పరిచయమవుతుండడం చాలా సంతోషంగా ఉంది. సినిమా టీజర్, రషెస్ చూశాను. మేఘామ్ష్‌లో మంచి ఈజ్ ఉంది. శ్రీహరి కన్నా పదిరెట్లు మంచి పేరు సంపాదిస్తాడన్న నమ్మకం ఉంది. అతను పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

శాంతి శ్రీహరి మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు శ్రీహరిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నట్లే మా బిడ్డను చూసుకుంటారని ఆశిస్తున్నా. మేఘామ్ష్ హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ “మంచి కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజ్ ధూత్’. దర్శకులిద్దరూ చాలా క్లారిటీతో తెరకెక్కించారు. మాటలు, పాటలు, సంగీతం అన్నీ బాగా కుదిరాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం”అని చెప్పారు. చిత్ర దర్శకులు అర్జున్, కార్తీక్ మాట్లాడుతూ “రచయితలుగా పలు సినిమాలకు పనిచేశాం. దర్శకులుగా పరిచయమవుతున్న చిత్రమిది. పోస్టర్, టీజర్ చూస్తేనే సినిమా స్టోరీ ఏంటనేది అర్థమైపోతుంది. హీరో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీదున్నాడు& ఆపక్కనే రాజ్‌దూత్ ఉంది. అదే ఈ సినిమా కథ”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నక్షత్ర, నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ, సురేష్ కొండేటి, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Raj dooth movie teaser launched

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: