చెట్లు హరివిల్లుల్లా

ఈ ఫొటోల్ని చూసి ఏంటీ ఈ చెట్టుపై ఎవరైనా రంగులద్ద్దారా? లేక ఇంద్రధనస్సు చెట్టుపై వాలిందా అనుకుంటున్నారా… అలా అను కుంటే పొరబడినట్లే.. దీని సంగతులేంటో తెలుసుకుందాం రండీ.. * దీని పేరు ‘రెయిన్‌బో యూకలిప్టస్’ ఇంకా రెయిన్‌బో గమ్ అని కూడా పిలుస్తారు. * ఇవి ఎక్కువగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువాన్యూగినియా ప్రాంతాల్లో కనిపిస్తాయి. * వీటికి పొడి, చలి ప్రాంతాలు పడవు. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఇవి పెరగవు. * అందమైన బెరడు ఉండటమే […] The post చెట్లు హరివిల్లుల్లా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ ఫొటోల్ని చూసి ఏంటీ ఈ చెట్టుపై ఎవరైనా రంగులద్ద్దారా? లేక ఇంద్రధనస్సు చెట్టుపై వాలిందా అనుకుంటున్నారా… అలా అను కుంటే పొరబడినట్లే.. దీని సంగతులేంటో తెలుసుకుందాం రండీ..

* దీని పేరు ‘రెయిన్‌బో యూకలిప్టస్’ ఇంకా రెయిన్‌బో గమ్ అని కూడా పిలుస్తారు.
* ఇవి ఎక్కువగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువాన్యూగినియా ప్రాంతాల్లో కనిపిస్తాయి.
* వీటికి పొడి, చలి ప్రాంతాలు పడవు. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఇవి పెరగవు.
* అందమైన బెరడు ఉండటమే దీని గొప్ప. బెరడుపై బ్లూ, గ్రీన్, ఆరెంజ్, మెరూన్, లావెండ ర్ ఇలా రకరకాల రంగుల చారలుంటాయి.
* ఒక్కోదగ్గర ఒక్కో రంగుల కలయికతో హరివిల్లుల్లా అందంగా దర్శనమిస్తాయి. బెరడు తీస్తుంటే ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది. తర్వాత అదీ రంగు మారిపోతుంటుంది. అలా భలే గమ్మత్తుగా ఉంటాయివి.
* వీటిని పేపర్ తయారీలో ఎక్కువగా ఉపయోగి స్తారు. కొన్ని ప్రాంతాల్లో అలంకరణకూ పెంచు తుంటారు. * దీని కలపకు పగుళ్లు రావు అందుకే పడవలు, ఫర్నీచర్ తయారీలోనూ వాడేస్తుంటారు.
* చాలా త్వరగా పెరుగుతుందిది. అందుకే ప్రపం చంలో అత్యంత వేగంగా పెరిగే వృక్షాల్లో ఒకటిగా దీనికి పేరు. 200 నుంచి 250 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి తెల్లని పూలు పూస్తాయి. ఆకుల్ని నలిపినప్పుడు ఓ కమ్మని సువాసన వస్తుం ది. ఎందుకంటే వాటిల్లో కొన్ని నూనెల్ని ఉత్పత్తి చేసే గ్రంథులుంటాయి.

rainbow eucalyptus tree

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చెట్లు హరివిల్లుల్లా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.