హైదరాబాద్ లో వర్షం

Rain in Hyderabad by Weather Department

హైదరాబాద్: భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎల్‌బినగర్, అబ్దుల్లాపూర్ మెట్టు, సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, మాసబ్‌ట్యాంక్ బంజారాహిల్స్, అమీర్‌పేటలో జోరు వాన కురిసింది. హస్తినాపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాలలో ఈదురు గాలులు వీసాయి. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జిహెచ్‌ఎంసి అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

The post హైదరాబాద్ లో వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.