మానస సరోవర జలంతో గాంధీకి రాహుల్ నివాళి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ టూర్ నుంచి తిరిగి వచ్చిన రాహుల్ సోమవారం ఉదయం రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పించారు. ఆయన మానస సరోవరం నుంచి తీసుకు వచ్చిన ప‌విత్ర జలాన్ని గాంధీ సమాధిపై చల్లారు. నివాళి అర్పించడానికి వచ్చిన రాహుల్ గాంధీ తన జేబులోంచి ఓ బాటిల్‌ను తీసి అందులో ఉన్న మానస సరోవర జలాన్ని మహాత్ముడి సమాధిపై […]

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ టూర్ నుంచి తిరిగి వచ్చిన రాహుల్ సోమవారం ఉదయం రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పించారు. ఆయన మానస సరోవరం నుంచి తీసుకు వచ్చిన ప‌విత్ర జలాన్ని గాంధీ సమాధిపై చల్లారు. నివాళి అర్పించడానికి వచ్చిన రాహుల్ గాంధీ తన జేబులోంచి ఓ బాటిల్‌ను తీసి అందులో ఉన్న మానస సరోవర జలాన్ని మహాత్ముడి సమాధిపై పోశారు. ఆగస్టు 31వ తేదీన రాహుల్ కైలాస యాత్రకు వెళ్లిన విషయం విదితమే. రాహుల్ అక్కడ కొందరితో సెల్ఫీలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, కైలాసంలో విద్వేషాలు లేవని కూడా రాహుల్ ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు. గాంధీకి నివాళి అర్పించిన అనంతరం రాహుల్ భారత్ బంద్  పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: