కశ్మీరు గవర్నర్‌కు రాహుల్ ఘాటు జవాబు

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం జమ్మూ కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. కశ్మీరులో వాస్తవ పరిస్థితిపై రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ మాలిక్ సోమవారం విమర్శించారు. కశ్మీరులో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయంటూ రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మాలిక్ సమాధానమిస్తూ కశ్మీరులో పరిస్థితిని స్వయంగా చూసేందుకు విమానం పంపిస్తానంటూ ఆహ్వానించారు. స్వయంగా పరిస్థితిని చూశాక అప్పడు మాట్లాడాలి అని ఆయన రాహుల్‌కు హితవు చెప్పారు. కాగా, కేరళలోని తన […] The post కశ్మీరు గవర్నర్‌కు రాహుల్ ఘాటు జవాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం జమ్మూ కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. కశ్మీరులో వాస్తవ పరిస్థితిపై రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ మాలిక్ సోమవారం విమర్శించారు. కశ్మీరులో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయంటూ రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మాలిక్ సమాధానమిస్తూ కశ్మీరులో పరిస్థితిని స్వయంగా చూసేందుకు విమానం పంపిస్తానంటూ ఆహ్వానించారు. స్వయంగా పరిస్థితిని చూశాక అప్పడు మాట్లాడాలి అని ఆయన రాహుల్‌కు హితవు చెప్పారు. కాగా, కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్‌లో ఇటీవల సంభవించిన వరదల పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడే కొన్ని రోజులు మకాం వేసిన రాహుల్ మంగళవారం ఢిల్లీకి తిరిగి వచ్చారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందిస్తూ, గవర్నర్‌గారూ..మీరు విమానం పంపవలసిన అవసరం లేదు కాని.. నేనూ..ఇతర ప్రతిపక్ష నాయకులం జమ్మూ కశ్మీరును సందర్శించడానికి అనుమతించండి చాలు. మీ విమానం మాకు అవసరం లేదు..మేము స్వేచ్ఛగా ప్రజలను, ప్రధాన పార్టీల నాయకులను, అక్కడ ఉన్న మన సైనికులను కలుసుకోవడానికి అనుమతించండి అని కోరారు. ఇటీవల కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డి. రాజా కశ్మీరులో పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచే వారిని తిప్పి పంపించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా వ్యంగ్యంగా స్పందించారు.

Rahul Gandhi sharp reposte on J&K Guvs remark, Jammu and Kashmir governor Satya Pal Malik had accused he of speaking irresponsibly about Valley situation

Rahul Gandhi sharp reposte on J&K Guvs remark, Jammu and Kashmir governor Satya Pal Malik had accused he of speaking irresponsibly about Valley situation

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీరు గవర్నర్‌కు రాహుల్ ఘాటు జవాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: