ప్యాకేజీ సరైన తొలి చర్య : రాహుల్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. సరైన దిశలో తీసుకున్న తొలి చర్య అని ఆయన గురువారం స్పందించారు. ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉంది. ప్రస్తుత దశలో ఇది అత్యవసరం అని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇతర విషయాలలో లాగానే కేంద్రం విఫలం అయిందని విమర్శిస్తూ వస్తోన్న రాహుల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ తరువాత స్పందించారు. […] The post ప్యాకేజీ సరైన తొలి చర్య : రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. సరైన దిశలో తీసుకున్న తొలి చర్య అని ఆయన గురువారం స్పందించారు. ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉంది. ప్రస్తుత దశలో ఇది అత్యవసరం అని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇతర విషయాలలో లాగానే కేంద్రం విఫలం అయిందని విమర్శిస్తూ వస్తోన్న రాహుల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ తరువాత స్పందించారు. దేశం అంతా కూడా రైతులు, రోజువారి కూలీలు, కార్మికులు, మహిళలకు, వయోవృద్ధులకు ఎంతో రుణపడి ఉందని, ప్రస్తుత లాక్‌డౌన్‌తో మరింత చితికిపోతున్న వీరికి తగు సాయం అందించాల్సి ఉందన్నారు. కేంద్రం ఈ దిశలో తీసుకున్న నిర్ణయాన్ని అంతా అభినందించాల్సిందే అన్నారు. కేంద్రం రూ 1,70,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. పట్టణ, గ్రామీణ పేదలకు కరోనా సాయంగా పలు చర్యలను వెల్లడించింది. ఈ ప్యాకేజీ ఒక మంచి పరిణామం అని రాహుల్ అభినందించారు.

Rahul Gandhi praises govt says economic package

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్యాకేజీ సరైన తొలి చర్య : రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: