పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్

  అహ్మదాబాద్: పరువునష్టం కేసులో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎన్‌బి మున్షీ రాహుల్‌గాంధీని ఆయన పేరు, వయసు, ఇతర వివరాలు అడిగారు. పరువునష్టం కేసులో మీరు దోషి అనుకుంటున్నారా? లేదా సమర్థించుకుంటారా? అని రాహుల్‌ను అడగ్గా … తను దోషిని కానని, తనను తాను సమర్థించుకుంటానని చెప్పారు. అహ్మదాబాద్ జిల్లా కోపరేటివ్ […] The post పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అహ్మదాబాద్: పరువునష్టం కేసులో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎన్‌బి మున్షీ రాహుల్‌గాంధీని ఆయన పేరు, వయసు, ఇతర వివరాలు అడిగారు. పరువునష్టం కేసులో మీరు దోషి అనుకుంటున్నారా? లేదా సమర్థించుకుంటారా? అని రాహుల్‌ను అడగ్గా … తను దోషిని కానని, తనను తాను సమర్థించుకుంటానని చెప్పారు. అహ్మదాబాద్ జిల్లా కోపరేటివ్ బ్యాంక్ (ఎడిసి) అధ్యక్షుడు అజయ్ పటేల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ రణదీప్ సుర్జే వాలాపై వేసిన పరువునష్టం కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. నోట్ల రద్దు సమయంలో ఎడిసి కేవలం అయిదు రోజుల్లో రూ 745 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, ఇది పెద్ద జాతీయ కుంభకోణమని సుర్జేవాలా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆరోపించారని అజయ్ పటేల్ గత ఏడాది జూన్ 22న రాహుల్‌గాంధీ, సుర్జేవాలపై కోర్టుకు విడివిడిగా దాఖలు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

అజయ్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌పై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 202 కింద మెట్రోకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. కోర్టుకు హాజరు కావలసిందిగా రాహుల్‌కు, సుర్జేవాలాకు సమన్లు జారీ చేసింది. ఇలా ఉండగా రాహుల్‌గాంధీ కూడా బెయిల్‌కు దరఖాస్తు చేశారు. బెయిల్ మంజూరుకు రూ .50,000 బెయిల్ బాండ్ ఇవ్వాలని కోర్టు కోరింది. అయితే, రాహుల్‌గాంధీ లాయర్ల అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని రూ. 15,000 కు తగ్గించి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు రూం లాయర్లు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో కిటకిటలాడింది. రాహుల్‌గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీ జాతీయ కోశాధికారి అహ్మద్ పటేల్, గుజరాత్ పార్టీ అధ్యక్షుడు అమిత్ చావ్దా, గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ధనాని కూడా హాజరయ్యారు.

Rahul Gandhi gets bail in defamation case

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: