వ్యాపారులకు మాఫీలు, రైతులకు టోపీలు

న్యూఢిల్లీ: రైతుల బాధల్ని పట్టించుకోని మోడీ సర్కార్‌ను కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు.వారికి ఎలాంటి ఊరట కల్పించలేదని, వ్యాపారవేత్తలకు రాయితీలు ఇచ్చి, లక్షల కోట్లలో వారికి రుణమాఫీలు కల్పించి, రైతులను చిన్నచూపు చూస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు. అయితే, ఆయన ఆరోపణను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో ఖండించారు. రైతుల దుస్థితికి సుదీర్ఘకాలపు కాంగ్రెస్ పాలనే కారణమని విమర్శించారు. మోడీ చేసినంతగా గతంలో ఏ ప్రధానమంత్రి కూడా రైతులకు సాయపడలేదన్నారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని చేపట్టని రాహుల్‌గాంధీ క్లుప్తంగా చేసిన […] The post వ్యాపారులకు మాఫీలు, రైతులకు టోపీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: రైతుల బాధల్ని పట్టించుకోని మోడీ సర్కార్‌ను కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు.వారికి ఎలాంటి ఊరట కల్పించలేదని, వ్యాపారవేత్తలకు రాయితీలు ఇచ్చి, లక్షల కోట్లలో వారికి రుణమాఫీలు కల్పించి, రైతులను చిన్నచూపు చూస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు. అయితే, ఆయన ఆరోపణను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో ఖండించారు. రైతుల దుస్థితికి సుదీర్ఘకాలపు కాంగ్రెస్ పాలనే కారణమని విమర్శించారు. మోడీ చేసినంతగా గతంలో ఏ ప్రధానమంత్రి కూడా రైతులకు సాయపడలేదన్నారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని చేపట్టని రాహుల్‌గాంధీ క్లుప్తంగా చేసిన ప్రసంగంలో కేరళపై ఫోకస్ చేశారు. తను ఎన్నికైన వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యేకించి ప్రస్తావించారు. రైతులకు చేయూత ఇవ్వకపోగా, వ్యాపారవేత్తలకు రూ.4.3లక్షల కోట్ల రాయితీలు మంజూరు చేశారని, రూ. 5.5 లక్షలకోట్ల రుణాలు మాఫీ చేశారని రాహుల్ చెప్పారు.

వ్యాపారవేత్తలకన్నా రైతుల్ని ఎందుకు తక్కువగా భావిస్తున్నారని నిలదీశారు. రాహుల్ విమర్శకు జవాబిస్తూ రాజ్‌నాథ్‌సింగ్ ప్రభుత్వం రైతులకు రూ.6000 కోట్ల మేరకు సాయం అందించాలనుకుంటోందని, ఇది వారి ఆదాయాన్ని 2025 శాతం ఎక్కువ చేస్తుందని, బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం రాకముందే ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ‘రైతుల పరిస్థితి దిగజారడం ఏ మూడు నాలుగేళ్ల నుంచో ప్రారంభం కాలేదు. ఎప్పటి నుంచో ఉంది. మా ప్రధానమంత్రిలా స్వతంత్రభారతంలో ఇంతవరకూ ఎవరూ కూడా కనీస మద్దతు ధరను ఇంతగా పెంచలేదు’ అని తెలిపారు. రుణాల్ని వసూలు చేసుకునే పనిని బ్యాంకులు ప్రారంభించారయని, కట్టలేని రైతుల ఆస్తుల్ని వెంటనే స్వాధీనం చేసుకుంటున్నాయని రాహుల్ అన్నారు.

Rahul Gandhi Fires On Modi Government

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వ్యాపారులకు మాఫీలు, రైతులకు టోపీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: