విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి

Rahul-Gandhi

 జె-కె గవర్నర్‌కు రాహుల్ చురక
 ప్రతిపక్ష నాయకులతో వస్తా: రాహుల్
 అలజడి సృష్టించాలనే ఆయన ఆలోచన
 రాజకీయం చేయొద్దు
 మండిపడిన గవర్నర్ సత్యపాల్ మాలిక్

న్యూఢిల్లీ/జమ్మూ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పై మంగళవారం విరుచుకుపడ్డారు. తనకు విమానం ముఖ్యం కాదని, భద్రతా దళాల మధ్య భయం భయంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, అక్క డి ప్రజల్ని కలుసుకొని, పరిస్థితిని అంచనా వేసేందుకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని రాహుల్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘జమ్మూకశ్మీర్‌కు రావడానికి విమానం పంపుతామని తమరు దయతో ఆహ్వానించారు. మంచిదే. నేను, ఇతర ప్రతిపక్ష నాయకుల బృందం తో జమ్మూకశ్మీర్‌కు, లడాఖ్‌కు వస్తాం. మాకు విమానం అవసరం లేదు. అయితే, మేము స్వేచ్ఛ గా పర్యటించేందుకు అవకాశం ఇవ్వాలి’ అని రాహుల్‌గాంధీ కోరారు. కశ్మీర్‌లో హింస చెలరేగుతోందని సమాచారం అందిందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సోమవారం తీవ్రంగా స్పందించిన జెకె గవర్నర్ సత్యపాల్ మాలిక్ …కశ్మీర్ లోయకు వచ్చేందుకు విమానం పంపుతాను. ఏవో తప్పుడు వార్త లు చూసి… బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఇలా మాట్లాడకూడదు. ఇక్కడికి వచ్చి పరిస్థితిని చూసి అప్పుడు మాట్లాడండి’ అన్నారు.
రాహుల్ రెచ్చగొట్టాలను కుంటున్నారు : మాలిక్
రాహుల్‌గాంధీ సమాధానానికి జెకె గవర్నర్ సత్యపాల్ మాలిక్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న ప్రధా న నాయకులను కలుసుకోవడంతో సహా తనకు స్వేచ్ఛ ఉండాలని రాహుల్ గాంధీ షరతులు పెడుతున్నారని, ఇక్కడ అలజడి సృష్టించేందుకే ప్రతిపక్ష నాయకుల బృందంతో వస్తానంటున్నారని ఆరోపించారు. ఒక రాష్ట్రానికి రావడానికి ఇన్ని షరతులా? అని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇన్ని షరతులు పెడతారని నేను ఆయనను పిలవలేదు. పోలీసులు, పాలనా యంత్రాంగానికి ఈ వ్యవహారం తెలిపాను. ప్రతిపక్ష నాయకుల బృందంతో వస్తానంటూ రాహుల్ ఈ అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. మరింత అలజడి రేపాలనుకుంటున్నారు’ అని గవర్నర్ మాలిక్ విమర్శించారు.

Rahul Gandhi Fires On Kashmir Governor Satya pal Malik

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.