ద్రవిడ్‌కు ఊరట

ముంబై: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద ఊరట కలిగింది. ద్రవిడ్‌పై నమోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో క్రికెట్ పాలకుల కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ద్రవిడ్‌కు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)లో కీలక బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం చేసింది. బంతి ఇప్పుడు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ కోర్టులో ఉందని సీఓఏ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ రవి తొగ్డె అన్నారు. ‘ద్రవిడ్ కేసులో విరుద్ధ ప్రయోజనాల […] The post ద్రవిడ్‌కు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద ఊరట కలిగింది. ద్రవిడ్‌పై నమోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో క్రికెట్ పాలకుల కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ద్రవిడ్‌కు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)లో కీలక బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం చేసింది. బంతి ఇప్పుడు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ కోర్టులో ఉందని సీఓఏ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ రవి తొగ్డె అన్నారు. ‘ద్రవిడ్ కేసులో విరుద్ధ ప్రయోజనాల అంశమేమీ లేదు. అతడికి నోటీసులు అందాయి. మేం ఆయన నియామకాన్ని క్లియర్ చేశాం. మాకు వివాదమేమీ కనిపించలేదు. అంబుడ్స్‌మన్ ఏమైనా గుర్తిస్తే మాకు ఎందుకు కనిపించలేదో అప్పుడు వివరిస్తాం.

ఆ తర్వాత జైన్ దానిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇదంతా ఓ ప్రక్రియ. ఇదిలా కొనసాగుతుంది’ అని రవి తొగ్డె వెల్లడించారు. భారత్‌ఎ, అండర్-19 కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను ఎన్‌సిఎ క్రికెట్ హెడ్‌గా నియమించారు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాని ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ద్రవిడ్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నోటీసులు పంపించారు. భారత క్రికెట్‌లో అత్యంత గౌరవించే అతడికి నోటీసులు ఇవ్వడంతో గంగూలీ సహా ఇతర క్రికెటర్లు భగ్గుమన్నారు. దీంతో బిసిసిఐ పాలకుల కమిటీ వెనక్కి తగ్గక తప్పలేదు.

Rahul Dravid has no conflict of interest case says COA

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ద్రవిడ్‌కు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: