నాదల్‌దే ఫ్రెంచ్ ఓపెన్

ఫైనల్లో థిమ్ చిత్తు, రఫెల్ ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్ పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రికార్డు స్థాయిలో 12వ సారి సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) మాత్రమే నాదల్ కంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా ఉన్నాడు. ఫెదరర్ 20 టైటిల్స్‌తో అగ్రస్థానంలో […] The post నాదల్‌దే ఫ్రెంచ్ ఓపెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ఫైనల్లో థిమ్ చిత్తు, రఫెల్ ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్

పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రికార్డు స్థాయిలో 12వ సారి సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) మాత్రమే నాదల్ కంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా ఉన్నాడు. ఫెదరర్ 20 టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నాదల్ అతనికంటే కేవలం రెండు టైటిల్స్ దూరంలో మాత్రమే నిలిచాడు.

కాగా, ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ ఆస్ట్రియా యువ సంచలనం, నాలుగో సీడ్ డొమినిక్ థిమ్‌ను చిత్తు చేశాడు. నాలుగు సెట్ల సమరంలో నాదల్ 63, 57, 61, 61 తేడాతో నాదల్ జయకేతనం ఎగుర వేశాడు. ప్రారంభం నుంచే నాదల్ చెలరేగి ఆడాడు. చక్కటి షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ థిమ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. నాదల్ జోరును ప్రదర్శించడంతో తొలి సెట్‌లో థిమ్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయాడు. చూడచక్కని షాట్లతో అలరించిన నాదల్ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో థిమ్ అనూహ్యంగా పుంజుకున్నాడు.

నాదల్ ఆధిపత్యాన్ని అడ్డుకుంటూ ముందుకు సాగాడు. ఒకదశలో స్పష్టమైన పైచేయి సాధించాడు. నాదల్‌ను హడలెత్తించిన థిమ్ 41 ఆధిక్యంలో నిలిచాడు. అయితే నాదల్ కూడా పట్టు వీడకుండా పోరాడాడు. థిమ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన థిమ్ టైబ్రేకర్‌లో సెట్‌ను సాధించాడు. ఆ తర్వాత నాదల్ అనూహ్యంగా పుంజుకున్నాడు. మూడో సెట్‌లో తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. అతని దూకుడు ముందు థిమ్ ఎదురు నిలువలేక పోయాడు.

తనకు మాత్రమే సాధ్యమయ్యే పదునైన షాట్లతో విరుచుకు పడిన నాదల్ స్పష్టమైన ఆధిక్యాన్ని అందుకున్నాడు. అతనికి కనీస పోటీ కూడా ఇవ్వకుండానే థిమ్ చేతులెత్తేశాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ అలవోకగా మూ డో సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా స్పెయిన్ బుల్‌కు ఎదురు లేకుండా పో యింది. ఈసారి కూడా నాదల్ జోరును కొనసాగించాడు. అసాధారణ షాట్లతో అలరించిన నా దల్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే సెట్‌ను గెలి చి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

మరోవైపు థి మ్‌కు వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్లో ని రాశ తప్పలేదు. నాదల్ పూర్తి ఆధిపత్యం చెలాయి స్తూ వరుసగా రెండోసారి కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ చేతిలో నాదల్ కంగుతిన్నాడు. ఈ సీజన్‌లో నాదల్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్.

Rafael sweeps to 12th French Open and 18th Grand Slam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నాదల్‌దే ఫ్రెంచ్ ఓపెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: