ఫైనల్లో నాదల్

న్యూయార్క్: ఊహించినట్టు స్పెయిన్ బుల్, రెండో సీడ్ రఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు రష్యా ఆశాకిరణం, ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ కూడా టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. ఇక, బల్గేరియా సంచలనం గ్రిగోరి దిమిత్రోవ్, ఇటలీ ఆశాకిరణం మాటియో బెరెటెని పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. ఫైనల్ సమరంలో నాదల్ రష్యా స్టార్ మెద్వెదేవ్‌తో తలపడుతాడు. బెరెటెనితో జరిగిన సెమీస్ సమరంలో నాదల్ విజయం సాధించాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన […] The post ఫైనల్లో నాదల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూయార్క్: ఊహించినట్టు స్పెయిన్ బుల్, రెండో సీడ్ రఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు రష్యా ఆశాకిరణం, ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ కూడా టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. ఇక, బల్గేరియా సంచలనం గ్రిగోరి దిమిత్రోవ్, ఇటలీ ఆశాకిరణం మాటియో బెరెటెని పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. ఫైనల్ సమరంలో నాదల్ రష్యా స్టార్ మెద్వెదేవ్‌తో తలపడుతాడు. బెరెటెనితో జరిగిన సెమీస్ సమరంలో నాదల్ విజయం సాధించాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ 76, 64, 61తో బెరెటెనిను ఓడించాడు. ఆరంభ సెట్‌లో నాదల్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు దూకుడును ప్రదర్శించడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. ఒకవైపు నాదల్ మరోవైపు బెరెటెని పట్టు వీడకుండా పోరాటం చేశారు. దీంతో ఆధిపత్యం తరచూ చేతులు మారుతూ వచ్చింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో కూడా ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఒక దశలో బెరెటెని కాస్త పైచేయి సాధించినట్టు కనిపించాడు. కానీ, అనుభవజ్ఞుడైన నాదల్ ఒత్తిడికి తట్టుకుంటూ ముందుకు సాగడంలో సఫలమయ్యాడు.

తీవ్ర ప్రతిఘటన ఎదురైనా నాదల్ తొలి సెట్‌ను గెలుచుకోవడంలో సఫలమయ్యాడు. ఇక, రెండో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఈసారి కూడా బెరెటెని అసాధారణ పోరాట పటిమతో నాదల్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే కీలక సమయంలో బెరెటెని ఒత్తిడికి గురయ్యాడు. అంతేగాక వరుస తప్పిదాలకు కూడా పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో నాదల్ సఫలమయ్యాడు. జోరును పెంచిన నాదల్ రెండో సెట్‌ను కూడా దక్కించుకున్నాడు. కాగా, మూడో సెట్‌లో మాత్రం నాదల్‌కు ప్రత్యర్థి నుంచి ఏమాత్రం ప్రతిఘటన ఎదురు కాలేదు. తొలి రెండు సెట్లలో నాదల్‌కు గట్టి పోటీ ఇచ్చిన బెరెటెని ఈసారి పూర్తిగా చేతులెత్తేశాడు. నాదల్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. ఆరంభం నుంచే కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన నాదల్ అలవోకగా సెట్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
ఎదురులేని మెద్వెదేవ్
మరో సెమీఫైనల్లో రష్యా స్టార్ మెద్వెదేవ్ విజయం సాధించాడు. బల్గేరియా ఆటగాడు గ్రిగోర్ దిమిత్రోవ్‌తో జరిగిన పోరులో మెద్వెదేవ్ 76, 64, 63తో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. తొలి
సెట్‌లో మెద్వెదేవ్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. దిమిత్రోవ్ అద్భుత షాట్లతో మెద్వెదేవ్‌ను హడలెత్తించాడు. ఇద్దరు విజృంభించి ఆడడంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఒక దశలో దిమిత్రోవ్ ఆధిపత్యాన్ని చెలాయించాడు. దీంతో మెద్వెదేవ్‌కు ఓటమి తప్పదా అనిపించింది. అయితే కీలక సమయంలో రష్యా స్టార్ పుంజుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేక షాట్లతో దిమిత్రోవ్‌పై ఎదురుదాడి చేశాడు. ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన మెద్వెదేవ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, రెండో సెట్‌లో కూడా ఆరంభంలో పోరు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ప్రారంభంలో దిమిత్రోవ్ ఆధిపత్యం చెలాయించాడు. మరోవైపు మెద్వెదేవ్ కూడా పట్టువీడకుండా పోరాడుతూ ముందుకు సాగింది. తన మార్క్ ఆటతో చెలరేగిన మెద్వెదేవ్ మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివరి వరకు దీన్ని కాపాడుకుని రెండో సెట్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇక, కీలకమైన మూడో సెట్‌లో మెద్వెదేవ్‌కు ఎదురులేకుండా పోయింది. ఈసారి దిమిత్రోవ్ పూర్తిగా చేతులెత్తేశాడు. తీవ్ర ఒత్తిడిలో కనిపించిన దిమిత్రోవ్ ఏదశలోనూ కోలుకోలేక పోయాడు. మరోవైపు దూకుడుగా ఆడిన మెద్వెదేవ్ అలవోకగా సెట్‌ను గెలిచి ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, మెద్వెదేవ్ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
ఇదే మంచి తరుణం
మరోవైపు ఇప్పటికే కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి సత్తా చాటిన స్పెయిన్ స్టార్ నాదల్ మరో టైటిల్‌పై కన్నేశాడు. చిరకాల ప్రత్యర్థులు జకోవిచ్, ఫెదరర్‌లు ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించడంతో నాదల్ పని సులువుగా మారింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన మెద్వెదేవ్‌ను ఓడించడం నాదల్‌కు కష్టమేమి కాదు. కానీ, సంచలన విజయాలకు మరో పేరుగా మారిన మెద్వెదేవ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇటీవల కాలంలో మెద్వెదేవ్ ప్రపంచ టెన్నిస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అసాధారణ ఆటతో సరికొత్త స్టార్‌గా అవతరించాడు. తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకునే మంచి అవకాశం మెద్వెదేవ్‌కు ఏర్పడింది. కానీ, ఇప్పటికే 27 సార్లు ఫైనల్‌కు చేరిన నాదల్‌ను ఎదుర్కొవడం అంత సులువుకాదనే విషయాన్ని మెద్వెదేవ్ మరువ కూడదు. ఏమాత్రం నిర్లక్షం వహించిన నాదల్ చేతిలో ఓటమి ఖాయం. మరోవైపు నాదల్ యుఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం ద్వారా చిరకాల ప్రత్యర్థి ఫెదరర్‌కు మరింత చేరువ కావాలని భావిస్తున్నాడు. నాదల్ 18 సింగిల్స్ టైటిల్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫెదరర్ 20 సింగిల్స్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈసారి నాదల్ గెలిస్తే ఇద్దరి మధ్య కేవలం ఒక టైటిల్ మాత్రమే తేడాగా ఉంటుంది. దీన్ని అందుకోవడం నాదల్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇదే జరిగితే ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం నాదల్‌కు ఏర్పడుతుంది.

Rafael Nadal reached the US Open final

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫైనల్లో నాదల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.