చిన్ననాటి స్నేహితురాలితో నాదల్ పెళ్లి

Rafael Nadal

మాడ్రిడ్: టెన్నిస్ స్టార్, స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ షిస్కా పెరిల్లోను నాదల్ పెళ్లాడాడు. దాదాపు 14 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్పెయిన్‌లోని దీవుల్లో అత్యంత అందమైనదిగా చెప్పు కునే మలోర్కాలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి దాదాపు 350 మంది సన్నిహితు లు, అతిథులు హాజరయ్యారు. వీరి వివాహానికి స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. నాదల్ సోదరి మారిబెల్‌కు షిస్కా చిన్న నాటి స్నేహితురాలు. ఓ వేడుకలో ఆమె ను కలిసిన నాదల్ ఆ పరిచయాన్ని స్నేహంగా, ప్రేమగా మలుచుకున్నాడు. అయితే వీరిద్దరి వివాహానికి సంబంధిం చిన ఫొటోలను మాత్రం నాదల్ ఇంకా మీడియాకు విడుదల చేయలేదు. ఈ పెళ్లికి స్పెయిన్ ఫ్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లు లోపెజ్, డేవిడ్ ఫెరర్‌లు హాజరయయ్యారు. అయితే నాదల్ లేవర్ కప్ టీమ్ ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మాత్రం ఈ వివామానికి రాలేదు. ప్రస్తుతం స్విస్ ఇండోర్‌బసిల్ టైటిల్‌ను నిలబెట్టుకు నేందుకు ప్రాక్టీస్‌లో ఉన్న ఫెదరర్ నాదల్ పెళ్లికి దూరంగా ఉన్నాడు.

Rafael Nadal marries Mery Xisca Perello in lavish Spanish wedding

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిన్ననాటి స్నేహితురాలితో నాదల్ పెళ్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.