ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా

హైదరాబాద్: అన్‌లైన్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డితో విజయవాడకు చెందిన అంజలి , చిన్నా కలిసి ముఠా గా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువతులను సరఫరా […] The post ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: అన్‌లైన్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డితో విజయవాడకు చెందిన అంజలి , చిన్నా కలిసి ముఠా గా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువతులను సరఫరా చేసే దళారులతో పరిచయముంది. వారి సహకారంతో కొంత డబ్బు చెల్లించి పశ్చిమ్ బంగా, కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులను నగరానికి తీసు కొచ్చి బల్కంపేటలోని అద్దె ఇంట్లో ఉంచారు. సామాజిక మాధ్యమాలు , లొకాంటో తదితర వెబ్ సైట్లలో ఈ నలుగురి ఫొటోలను ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారమంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది . విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహకులు అప్రమత్తమవుతారు. మీకు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ తీసి మళ్లీ ఫోన్ చేస్తా మంటూ కట్ చేస్తారు. వంశీరెడ్డి ట్రూ కాలర్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పరిశీలించి ఎలాంటి ఇబ్బంది ఉండదని నమ్మకం కుదిరాక ఆ నంబరు తిరిగి ఫోన్ చేస్తారు. గూగుల్ పే , ఫోన్ పే , పేటిఎం ద్వారా ముందుగా కొంత మొత్తం కట్టించుకుంటారు. చెల్లించిన మరుసటి రోజు లేదా విటులు కోరుకున్న సమయంలో యువతులను తీసుకెళ్తారు. సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్‌ఒటి ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, కీసర ఇన్ స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నిర్వాహకులను మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లికి రప్పించి వంశీరెడ్డిని అరెస్ట్ చేశారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: